రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైయస్ షర్మిలా మంగళవారం పర్యటించారు.నిరుద్యోగుల కోసం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి,అనంతరం వైయస్ షర్మిలా నిరాహార దీక్ష వట్టిమల్లలో చేపట్టారు.వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకొని మృతిచెందిన మహేందర్.వారి కుటుంబ సభ్యులను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా మంగళవారం పరామర్శించి యువకునికి నివాళులర్పించారు.గ్రామంలో నిరు ద్యోగ నిరాహార దీక్ష చేపట్టి.ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.వైఎస్ఆర్ మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు.కానీ తెలంగాణ లో కేసీఆర్ ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారని ప్రశ్నించారు.అంతేగాక కేసీఆర్ వైఎస్ఆర్ లాగా ఎలాంటి రుణమాఫీ ఇవ్వలేదు.ఇంకా కాలేజీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ చెయ్యలేదని అన్నారు.ఇక అప్పుడు ప్రత్యేక తెలంగాణా కావాలని 1200 మంది తెలంగాణా రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్నారన్నారు.ఇక ఇప్పుడు కూడా ఎన్నో వందల మం ది ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక తెలంగాణా రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గదిలో బందీ అయ్యిందన్నారు.ఇక ట్రైన్ కిం ద పడి నిన్న షబ్బీర్ చనిపోయాడని షర్మిళ గుర్తు చేశారు.చేతికి వచ్చిన బిడ్డలు శవాలై వస్తున్నారని తన బాధని వ్యక్తం చేశారు.కేసీఆర్ వల్ల తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని వాపోయారు.ఇక మేము దీక్ష చేస్తే కేసీఆర్ దొరకు నచ్చలేదు అందుకే దాడులు చేయించారని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే కేసీఆర్ కుమారుడు చిన్న దొర కేటీఆర్ కు కూడా మా దీక్షలు నచ్చలేదని షర్మిళ అన్నారు.మా దీక్షలను అవమానించారని షర్మిళ చెప్పారు.అంతేగాక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు గు రించి కూడా మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మొగోళ్ళు అని నిరూపించుకోవాలని నిప్పులు చేరిగారు.అలాగే కేసీఆర్ కొడుకును కేసీఆర్ కొడుకు అనక ఇంకేం అనాలని ప్రశ్నించారు.కొడుకు అనే కదా అన్నది అని షర్మిళ అన్నారు.కేసీఆర్ కి కొడుకు కాకపోతే ఇన్ని శాఖలు ఇచ్చే వారా అని ప్రశ్నించా రు.అలాగే నేను వైఎస్ బిడ్డ అని గర్వాంగ చెప్పుకుంటానని షర్మిళ అన్నారు.అలాగే గుట్కా రాష్ట్రం అంతా కూడా నిషేధం ఉంటే ఇక్కడ మాత్రం పాలకులే పంపిణీ చే స్తున్నారన్నారు.నేతన్నల బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదని షర్మిళ కోపాన్ని వ్యక్తం చేశారు.ఓ మహిళ తన భూమి సమస్య కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు ఏకంగా తాళి కట్టి బుద్ధి చెప్పిందని షర్మిళ గుర్తు చేశారు.కేసీఆర్ వెంటనే రాజీనామా చెయ్యాలి,దళితుణ్ణి సీఎం చెయ్యాలని షర్మిళ డిమాండ్ చేశారు.