ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్

టోక్యో:ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమి ది పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం చేసింది.జర్మనీతో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించింది.అఖండ భారతావనిని మురిపించింది.టో క్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో చిత్తు చేసింది.41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దా డింది.ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే.కాగా,ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది.నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది.రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి.అయితే మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.కీలకమైన నాలుగో క్వార్టర్ ప్రారంభంలోనే జర్మనీ జట్టు గోల్ చేసి లీడ్‌ను 5-4కి తగ్గించింది.అయితే భారత ఆటగాళ్లు ఆటపైన బంతిపైన నియంత్రణ సాధించి జర్మనీ మరో గోల్ చేయకుండా అడ్డు కున్నారు.దీంతో ఇండియా జట్టు 5-4 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్యపతకాన్ని గెలుచుకుంది.41 ఏళ్ల తరువాత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించింది.ఒలింపిక్స్‌తో పతకం సాధించిన ఇండియా జట్టుకు భారత ప్రధాని మోడీ అభినందలను తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here