ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు సాధించిన..ధర్మపురి యువకుడు

కరీంనగర్:ఐఐటీలో సీటు రావడం మాటలు కాదు.ఎంతో కఠోర శ్రమ ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు.అలాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో అవలీలగా సీటు సాధించాడో యువకుడు.ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు సాధించాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన ఆదిత్య గేట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా స్థాయిలో 24వ ర్యాంకు సాధించి మొదటి విడతలోనే ఆరు ఐఐటీల్లో సీటు సంపాదించాడు.చదువులో మొదటి నుంచి ముందు వరుసలో ఉండే అదిత్య ఎస్ఎస్సీ కరీంనగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి కంప్లీట్ చేశాడు.ఆ తర్వాత ట్రినిటీ కాలేజీలో ఇంటర్ టాపర్ గా నిలిచి ఎంసెట్లో ర్యాంకు ద్వారా హన్మకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ సీటు సం పాదించాడు.ఆ తరువాత గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంటెక్ సీటు సంపాదించాడు.తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి టీసీఎస్ కి ఎంపికయ్యా డు.మరికొద్ది రోజులకే మరోసారి జూనియర్ టెలికం ఆఫీసర్ హోదాలోబీఎస్ఎన్ఎల్ ఉద్యోగానికి ఎంపికై కేరళలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు.గేట్ పరీక్షతో సీట్ల దండయాత్ర ఇలా బీఎస్ఎన్ఎల్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆదిత్య తన చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.అటు ఉద్యోగం చేస్తూనే ఇటు గేట్ పరీక్షకి ప్రిపేర్ అయి మళ్లీ పరీక్ష రాశాడు.ఈసారి ఏకకాలంలో 6 ఐఐటీల్లో మొ దటి విడతలోనే సీటు లభించింది.దిల్లీ,ముంబయి,రూర్కీ,మద్రాస్,గౌహతి,ఖరగ్పూర్ లలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీల్లో అడ్మిషన్ సాధించిన ఆదిత్య సక్సెస్ నిజంగా వండ ర్ అని చెప్పవచ్చు.ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తన లక్ష్యంగా చెబుతున్న ఆదిత్య ఇప్పటికే ఆ పరీక్ష కోసం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి అందులోనూ ప్రిలిమ్స్ పూర్తి చేయడమే కాకుండా మెయి న్ పరీక్ష కూడా సెలెక్ట్ అయ్యాడు.దిల్లీ ఐఐటీలోని కంట్రోల్ అండ్ ఆటోమేషన్ తో పాటు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రెండువిభాగాల్లోనూ ఆదిత్యకు అవకాశం దక్కింది.అత్యంత ప్రతిష్ఠా త్మకమైన బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు ఆదిత్య.దీనికి సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది.వరస విజయాలు సాధిస్తున్న ఆదిత్య కమిట్మెంట్ పట్ల స్థా నిక ధర్మపురి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదువు పట్ల శ్రద్ధ చూపేలా చేసిన అతని పేరెంట్స్ కాకేరీ లలిత,సనత్ కుమార్ లని అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here