అక్కడ అందరికీ ముగ్గురు భార్యలు…లేదంటే స్వర్గం దొరకదట..!

హైదరాబాద్:ఒక భార్యతో గొడవ పడే ఈ కాలంలో కనీసం ముగ్గురు భార్యలను మెయింటైన్ చేసేవారున్నారు.ఈ ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతం తనదైన విభిన్న ప్రపంచాన్ని తయారు చేసుకుంది. అది ఏ ప్రపంచం? దాని గుర్తింపు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పశ్చిమ అమెరికాలోని ఈ రాష్ట్రం పేరు ఉటా.ఇక్కడ ఉన్న అన్ని కొండలలో ఒక ప్రత్యేకమైన కొండ ఉంది.అక్కడ 100 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.వీరు గిరిజనులు కాదు.వలస వచ్చిన వారు.వారు తమ సొంత సంఘాన్ని సృష్టించుకున్నారు.వీరందరూ ఒక ఫండమెంటలిస్ట్ మోర్మాన్ అనుచరులు,ఇక్కడ ప్రతి మని షికి ఒకరికంటే అధిక సంఖ్యలో భార్యలు ఉంటారు.ఈ రాతి కొండపై దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్నాయి.ఈ శిలను రాక్‌ల్యాండ్ రాంచ్ అని అంటారు.ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను క లిగి ఉండటం అంటే మరణానంతరం స్వర్గం పొందడం అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.ఇక్కడ నివసిస్తున్న మోర్మాన్‌లు 1970లలో ఇక్కడికి వలసవచ్చినట్లు చెబుతారు.ఈ కల్ట్‌ను బాబ్ అనే ఫా స్టర్ ప్రారంభించారు.ఆ ఫాస్టర్‌కి ముగ్గురు భార్యలు,38 మంది పిల్లలు ఉన్నారు.బాబ్ ఫాస్టర్ బహుభార్యత్వం ఉన్నందుకు జైలు పాలయ్యాడు.అతను జైలు నుండి విడుదలయ్యాక తన సొంత సం ఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు,రాక్‌ల్యాండ్ రాంచ్‌లో తన భార్యలతో నివసిస్తున్నాడు.అతని ఆలోచనతో ఏకీభవించిన,అతనిని అనుసరించిన కొంతమంది క్రైస్తవులు అతనితో రాక్‌ల్యాండ్ రాంచ్‌లో నివసించడం ప్రారంభించారు.క్రమంగా అది పెద్ద కుటుంబంగా మారింది.ఒక నివేదిక ప్రకారం ఇక్కడి ప్రజలు శాంతి కామకులు.భార్యలందరూ ఒకరితో మరొకరు ప్రేమగా జీవిస్తారు.

America: ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే.. లేదంటే స్వర్గం లభించిందట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here