ఇది తెలుసా?మోడీ కేబినెట్‌లో..42శాతం మందిపై క్రిమినల్ కేసులట..

న్యూఢిల్లీ:నరేంద్ర మోడీ నయా కేబినెట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయమిది.కేంద్ర కేబినెట్‌ను ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం సమూల ప్రక్షాళన చేయడం తెలిసిందే.బుధవారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోడీ వారికి శాఖలు కేటాయించారు.కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 15 మంది కేబి నెట్ హోదా మంత్రులు కాగా28 మంది సహాయ మంత్రి హోదాలో ఉన్నారు.వీరిని కలుపుకుని కేంద్ర మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య 78 కు చేరింది.కేంద్ర కే బినెట్‌లోని మంత్రుల్లో దాదాపు సగానికి సగం మందిపై క్రిమినల్ కేసులున్నాయి.తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు 42శాతం మంది తమ అఫిడవిట్లలో డిక్లేర్ చేసి నట్లు ఎన్నికల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏఆర్డీ) తన రిపోర్ట్‌లో తెలిపింది.33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులుండగా వీరిలో 24 మంది మంత్రులు హత్య,హత్యాయత్నం,దోపిడీ వంటి తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు.ఎన్నికలకు ముందు నామినేషన్లతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లలోని కేసుల వివరాలను విశ్లేషించి ఏడీఆర్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here