పెరిగిన పేట్రోల్,డీజల్ ధరలను తగ్గించాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల:సామాన్య ప్రజల పాలిట శాపంగా ప్రభుత్వాలు మారుతున్నాయని మండిపడ్డారు జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖ రుల సమావేశంలో ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కెసిఆర్ అక్కడ మోడీ ఇక్కడ కేడి ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని విమ ర్శించారు.నేడు దేశంలో నిరుద్యోగ సమస్యతోపాటుగా గత నాలుగు మాసాలుగా కరోనాతోప్రజలంతా విలవిలాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజ లపై గత 13 నెలలుగా వరసగా పెట్రోల్,డిజిల్‌ ధరలను పెంచుతూ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా బిజెపి ప్రభుత్వం వ్యాపార దృక్పదంతో వ్యవహరించ డం వలన ప్రజలను మరింత తీవ్రంగాకుంగదీస్తుంది.కరోనాతో లాక్‌డౌన్ల ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోయింది.ప్రపంచంలో అధికజనాభా ఉన్న మన దే శంలో లాక్‌డౌన్లతో పేద,మధ్య తరగతి,ఉద్యోగ,వ్యాపార,రైతు,చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయారు.ప్రభుత్వాలు చేసిన ఉపశమణ కార్యక్రమాలు,ఆర్థిక వెసులుబాటు లు ప్రజలను పెద్దగా అదుకోలేకపోయాయి.వలన కార్మికులు తీవ్రంగా నష్టపోయారు.ఉద్యోగ ఉపాధి కరవై వందల కిలోమీటర్ల దూరం లో ఉన్నవారి ఊళ్ళకు కాలినడ కన వెల్లి కాలం వెల్లదీసే దుర్భర జీవితాన్ని చవి చూశారు.కరోనా సమయంలో పని దొరక్క కుటుంబానికి పోషించలేక ఇబ్బంది పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిట్రోల్,డీజిల్,ధరలతో నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు.గత నెల రోజుల్లో ప్రభుత్వం 18 సార్లు పెట్రోలు,డీజిల్,ధరలు పెం చడం అమానుషమన్నారు.పెంచిన ధ‌ర‌ల ప్ర‌భావం నిత్యావసర సరుకులపై ప‌డింద‌న్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధ‌ర రూ.100 దాటింద‌న్నారు.క‌రోనాతో ప్ర‌జ‌లు ఓ వైపు అల్లాడుతుంటే మ‌రోవైపు ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు ఏమి కోన‌లేని తిన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌న్నారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలపై కక్షతో భారాలు మోపుతోందని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపుని చ్చారు,కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సింది పోయి వారిపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించేందుకు ప్రజలపై భారాలు మో పుతోందని విమర్శించారు,మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు.పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ నెల 12 వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ నుండి అర్డివో అపిస్ వరకు ఎండ్లబండ్లు,సైకిల్ ర్యాలీ కలదు కావున జగిత్యాల జిల్లాలో గల 18 మండలాలు,మూడు నియోజకవర్గల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి కార్యక్రమన్నీ విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here