బావిలో పడ్డ కారు..రిటైర్డ్ ఎస్సై మృతి

కరీంనగర్:కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశా రు.కరీంనగర్ కారు బావిలో పడిన ఘటనలో విషాదకర అంశమే కాకుండా అత్యంత విస్తుపోయే విషయం కూడా కారుతో పాటు బయటపడింది.ఉదయం నుంచి బావి లో నుంచి కారు బయటకు తీసేందుకు పని చేస్తున్న ఫైర్ సర్వీస్ అధికారికి బావిలో పడ్డ కారులోంచి శవమై బయటకొచ్చిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ స్వయం గా అన్న.ఆ విషయం ఉదయం నుంచి తెలీదు.కారు బయటకు తీసి శవాన్ని బయటకు లాగాక ఆయన తన అన్న అని గుర్తుపట్టారు సదరు ఫైర్ సర్వీస్ అధికారి. ఇలా ఉండగా,కరీంనగర్ జిల్లాలో బావిలోపడ్డ కారును బయటకు తీశారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 గంటల పాటు నాన్‌స్టాప్‌గా శ్రమించింది రెస్క్యూ టీమ్‌  తొలుత గజ ఈతగాళ్ల సాయంతో ప్రయత్నించారు.ఆ తర్వాత క్రేన్ల సాయంతో కారును బయటకు తీయగలిగారు.హైదరాబాద్‌ నుంచి హుస్నాబాద్‌ వెళ్తున్న కారు చి న్నముల్కనూర్‌ దగ్గర ఉదయం 11 గంటల సమయంలో బావిలోకి దూసుకెళ్లింది.ఆ వెహికల్ కొత్తకారుగా గుర్తించారు.డ్రైవర్‌ సీట్‌లో ఉన్న ఒకరు చనిపోయారు.అ తన్ని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్సై పాపయ్యనాయక్‌గా గుర్తించారు.ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బ యటకు తీశారు.బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం అగ్నిమాపక,ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కష్టంగా మారింది.దాదాపు 9గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు.కారు అద్దాలు తెరచి చూడగా అందులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు.కారు కరీంన గర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here