కరీంనగర్:50ఏండ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఐపీ ఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.ఐఏఎస్ అధికారిగా,సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పేద ప్రజలకు చేసింది 1 శాతమేనని మిగిలిన 99 శాతం ప్రజలకు న్యాయం చేసేందుకు ఐపీఎస్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసినట్లు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.కరీంనగర్ కు తాను వచ్చింది అబద్ధం ప్రచారాలు చేయడానికి కాదన్నారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.కరీంనగర్ జిల్లా కార్పోరేషన్ పరిధిలోని అలుగునూరులో జరిగిన బహుజన సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఇందులో భాగంగా మాట్లాడారు.ఈ సమావేశం ద్వారా యావత్ తెలంగాణకు గుండె చప్పుడు వినిపించడానికి వచ్చామన్నారు.మా గోస చెప్పుకునేందుకే మేమంతా ఇక్కడ సమావేశమయ్యామన్నారు.ఇంత కాలం మా బాధలు వినేవాళ్లు,కన్నీళ్లు తుడిచేనా థుడు ఎవరు లేరన్నారు.అందుకే బహుజన రాజ్యం తెచ్చుకోవడానికి వచ్చామన్నారు.చట్టబద్ధంగా,శాంతియుతంగా బహుజన రాజ్యం కోసం పోరాడుతామన్నారు. ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉద్యోగాలు పోయాయని ఏడుస్తున్నారు.వీళ్లంతా బహుజనులేనన్నారు.ఓవైపు కేసీఆర్ దళిత సాధికారత అంటున్నా రు.మీరు వీళ్ల ఉద్యోగాలు పోయాక సాధికారిత ఎక్కడుందన్నారు.బహుజన రాజ్యం మన బిడ్డల భవిష్యత్తు మార్చాలని,బహుజన రాజ్యాధికారం కోసం ప్రాణత్యాగా నికైనా సిధ్ధమేనన్నారు.