బ్రహ్మ..మనుషుల తల రాతలు నిజంగా రాస్తాడా.?

0
385


జమ్మికుంట:మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కాదా మరి ఈ పూజలు పున్సకారాలు ఎందుకు? అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదు టిని రాత రాసేటప్పుడు అందు లోనే ఒక మాట రాసాడంట.నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనల తోటి,మీ అర్చనల తోటి,నిస్వార్థ మైన కర్మలతో మా ర్చుకో గలరు అని రాసారంట అర్చనలు,ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారట బ్రహ్మ ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆ యువు రాస్తే,ఆ వ్యక్తి చేసే పాపా లను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది.ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పా డు.పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది.ఆ మరణ గండా న్ని ఎవ్వరు తప్పిం చలేరని రాసాడు బ్రహ్మ.అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి,గురువు చెప్పినట్టు అర్చన,మృత్యుంజయ జపం చేసి చావ వలసినవాడు బ్రతికా డు.జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రీత్యా వీడు చచ్చి పోవాలండి,కాని బ్రతికాడని అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నారు అట ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి “గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని”ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యు గండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.కాబ ట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని,మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం,మంత్రాలను చదవడం,ప్రదక్షణలు చేయడం,ఎదుటివారిని నిస్వార్థంగా ఆదుకోవడం వలన చా లా వరకు బ్రహ్మ రాత పాతది తొలగి పోయి కొత్తది వస్తుంది.ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి.”అమ్మ పాదాలను”స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు,ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.కాబట్టి ఆయువు ఉన్న ప్పటికీ,బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు.అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.అందుక ని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు,దానాలు,ధర్మాలు,పేదలకు సహాయం చెయ్యడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here