చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!

కరీంనగర్‌:బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైందని,గ్రామ,వార్డు స్థాయి కేంద్రాలతో పాటు ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని రాష్ట్ర చేనే త,జౌళి శాఖ సంచాలకురాలు శైలజారామయ్యర్‌ తెలిపారు.కరోనా దృష్ట్యా పంపిణీ విధానాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛనుత జిల్లా కలెక్టర్లకు ఇచ్చామని,ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.శనివారం నుంచి రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.”పండుగ సందర్భంగా పేద మ హిళలకు కానుకగా,నేతన్నలకు ఉపాధి మార్గంగా ప్రభుత్వం గత అయిదేళ్లుగా బతుకమ్మ చీరల పథకాన్ని అమలుచేస్తోంది. మొత్తం రూ.333.14 కోట్లతో ఈ సంవత్సరం 1.08 కోట్ల (గతేడాది కంటే 14 లక్షలు అధికం) చీరలు పంపిణీ చేస్తున్నాం. పాలిస్టర్‌ ఫిలమెంట్‌, నూలు, జరీ అంచులతో 810 రకాల చీరలు అందుబాటులో ఉంటాయి” అని శైలజారామయ్యర్‌ వివరించారు.బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా ఆడ‌బిడ్డ‌లకు తెలంగాణ ప్ర‌భుత్వం కానుక‌గా ఇస్తున్న బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నాయి.ఇప్ప‌టికే త‌యారీ పూర్త‌యిన బ‌ తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్ కూడా మొద‌లుపెట్టారు.హైద‌రాబాద్‌లోని చంద్రయాణ‌గుట్ట‌లోని టెస్కో గోడౌన్ల‌లో ఈ ప్ర‌క్రియ‌ చ‌క‌చ‌కా న‌డుస్తోంది.బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరలను త యారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్‌ ఇచ్చింది.దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు,వరంగల్‌లో 13 లక్షలు,కరీంనగర్‌లో 12 లక్షల చీరలు త యారు చేశారు.ఈ సారి 17 రంగులు,15 డిజైన్లలో తయారైన ఈ చీరల‌ను ప‌లు జిల్లాల‌కు త‌ర‌లించి గోదాముల్లో కూడా భ‌ద్ర‌ప‌రిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here