ఈ-ఓట్‌ యాప్‌కు..రాష్ట్ర ఎన్నికల సంఘం..ఐటీ శాఖ,సీడాక్‌,ఐఐటీ సంయుక్త కృషి 

హైదరాబాద్:ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓట్‌ యాప్‌కు రూపకల్పన రాష్ట్ర ఎన్నికల సంఘం ఐటీ శాఖ సీడాక్‌ ఐఐటీ సంయుక్త కృషి ఓటింగ్‌ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంటోంది.మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ),తెలంగాణ ఐటీ శాఖ,కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌,బొంబాయి ఐఐటీ,భిలా య్‌ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్‌ యాప్‌ తయారైంది.వివిధ ప్రయోగాలు,పరిశీలనల అనంతరం దీనికి తుదిరూపు ఇచ్చారు.అనేక భద్రతా అంశాలను పరిగణన లోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు.అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ముందుగా రాజకీయ పార్టీలకు దీని గురించి వివరించి అభిప్రాయాలను తెలుసుకుంటారు.కేంద్ర ఎన్నిక ల సంఘానికి నివేదిస్తారు.మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరిశీలిస్తారు.ఆ తర్వాత తుది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.దేశంలో ఎన్నో కోట్లమంది ఓటర్లు ఓ టు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ-ఓటింగ్‌ విధానం మార్పునకు నాంది కావచ్చని భావిస్తున్నారు.పోలింగ్‌ కేంద్రానికే వచ్చి ఓటు వేయాల్సిన అవసరం లేకుం డా ఆధునిక సాంకేతికతతో ఈ-ఓట్‌ విధానాన్ని అభివృద్ధి చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది కూడా కొవిడ్‌ వంటి మహమ్మారి తలెత్తినప్పుడు కానీ, ఇతరత్రా మరెలాంటి పరిస్థితుల్లో అయినా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ విధానం దోహదపడుతుందని ఆశిస్తున్నారు.బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ,కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇం టెలిజెన్స్‌) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ-యాప్‌ తయారైంది.పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా దీనిని రూపొందించారు. యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.ఓటర్లు గుర్తింపు కార్డు,ఆధార్‌ కార్డు,ఫోన్‌ నంబరు ఆధారంగా ఈ యాప్‌ను ఉప యోగించుకోవచ్చు.దీని వల్ల దేశంలో ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడి నుంచైనా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.సైనికులు,వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు సహా ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ విధానంలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.ఓటింగ్‌ ఎలా అంటే..రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు పోలింగ్‌ రోజున ఈ యాప్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవ చ్చు.ఓటింగ్‌కు ముందు కూడా రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేయాలి.రిజిస్ట్రేషన్‌ సమయంలో తీసుకున్న ఫొటో ఓటు వేసేందుకు ముందు తీసుకున్న ఫొటోలను సరిపోల్చుకున్నాక బ్యాలెట్‌ పేపర్‌ డిస్‌ప్లే అవుతుంది.అప్పుడు ఓటు వేయవచ్చు.ఎవరికి ఓటు వేశారో స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.ఎక్కడా వ్యక్తుల ప్రమేయం లేకుండా అంతా సాంకేతికతతోనే సాగుతుంది. ఈ-ఓట్‌ విధానంలో వచ్చిన ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.యాప్‌ ఎలా పనిచేస్తుందంటే ఇందులో రెండు ప్రక్రియలు ఉంటాయి.మొదటిది రిజిస్ట్రేషన్‌,రెండోది ఓటు వేయడం.బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ,కృత్రిమ మేధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ,కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను ఉపయోగించినందున అవకతవకలకు ఆస్కారం ఉండదు.బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో వివరాలు మార్చడానికి వీలుండదు.ఫొటోలను సరిపోల్చడానికి కృత్రిమమేధ సాంకేతికత ఉపయోగపడుతుంది.ఫోన్‌ను హ్యాక్‌ చేయడానికి వీ లులేని సాంకేతికతను ఉపయోగించారు.ఈ-ఓట్‌ విధానంలో ఓటు వేయడానికి ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికి వీలుకాదు.లైవ్‌ ఫొటోతో నిర్ధా రణ అయితేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.ఒక మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.రిజిస్ట్రేషన్‌,ఓటింగ్‌కు ఒకే ఫో న్‌ నంబరు,మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించాలి.ఒకరి బదులు మరొకరు ఓటు వేయడానికి వీలులేని విధంగా సాంకేతికత ఉపయోగించారు.వివిధ రాష్ట్రాల ఎన్నికల సంఘాల ఆసక్తి తెలంగాణ ఎన్నికల సంఘం,రాష్ట్ర ఐటీ శాఖ కలసి ఈ-ఓట్‌ యాప్‌ గురించి ఇతర రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు వివరించారు.వివిధ రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపినట్లు తెలిసింది.ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఐటీ విభాగం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కూడా రాష్ట్ర ఐటీ శాఖ దీని గురించి వివరించినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here