ఈటలను గెలిపిస్తాం..మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం..:బండి సంజయ్‌

0
379

సిద్దిపేట:ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించా రు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు.అయితే,కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చేస్తామని వెల్లడించారు.రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ పోయింది.కానీ,గులాబీ తుఫాను మాత్రం పోవడం లేదన్న ఆయన రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీని ఓట్ల తు ఫాన్‌లో కొట్టుకు పోయేలా చేస్తా అన్నారు.మరోవైపు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు బండి సంజయ్‌ కుమార్ సిరిసిల్లలో వర్షానికి ఇళ్లు,కార్లు కొట్టుకుపోతుంటే పట్టించుకోని కేటీఆ ర్ నేను టీఆర్ఎస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.టీఆర్ఎస్ పార్టీ ఇవ్వని డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను,దళిత బంధుకు,రైతుల గొం తు వినిపించడానికి,హిందూ సమాజాన్ని కాపాడడానికి నేను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటాను అంటూ బండి సంజయ్ ప్రకటించారు‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here