భర్త వదిలేసిన ఓ మహిళ..నేడు ఎస్సైగా..!

తిరువనంతపురం:కేరళకు చెందిన అని శివ అనే మహిళ 18 ఏళ్ల వయస్సులో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న సమయంలో ఒకరిని ప్రేమించింది.తన తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా అతడిని పెళ్లిచేసుకుంది.దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను బహిష్కరించారు.ఆమె వైవాహిక జీవితం కూడా సవ్యంగా సాగలేదు.బిడ్డ పుట్టిన ఆరు నె లలకు భర్త ఆమెను వదిలేశాడు.దీంతో తన నానమ్మకు సంబంధించిన చిన్ని రేకుల షెడ్డులో బిడ్డతో కలిసి జీవించసాగింది.బతుకుతెరువు కోసం వర్కాలా శివగిరి ఆ శ్రమ ప్రాంతంలో నిమ్మ రసం,ఐస్ క్రీములు అమ్మడం,హస్తకళా వస్తవుల అమ్మకం వంటి చిన్న చిన్న వ్యాపారలు చేయడానికి ప్రయత్నించినా ఏదీ కలిసిరాలేదు.ఇ దిలా ఉండగా ఓసారి ఆమెను గమనించిన ఓ వ్యక్తి చదువు పూర్తి చేసి ఎస్సై పరీక్ష రాయమని సలహా ఇచ్చాడు.దానికి ఆర్థిక సాయం కూడా చేశాడు.ఆ వ్యక్తి సలహా మేరకు ఆమె ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగం సంపాదించింది.వర్కాలా పోలీస్ స్టేషన్ లో తనకు పోస్టింగ్ ఇచ్చారని ఎక్కడైతే తాను కన్నీరు పెట్టుకున్నానో అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తానని తలుచుకుంటే చాలా గర్వంగా ఉందని అని పేర్కొందిి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here