రికార్డు నమోదు చేసిన’సారంగా దరియా’

హైదరాబాద్:నాగచైతన్య,సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’.ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.ఈ చిత్రంలోని సారంగ దరియా అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది యూనిట్.ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో నెవర్ బిఫోర్ రికార్డులు నమోదు చేస్తూ దూసుకె ళ్తోంది.కొన్ని రోజుల క్రితం సమంత అక్కినేని చేతుల మీదుగా ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ పాట మరుక్షణం నుంచే దూసుకెళ్లడం మొదలు పెట్టింది.అలా మొదలైన వ్యూయర్‌షిప్ అంతకంతకూ వేగంగా పెరుగుతూ టాలీవుడు రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్లింది.టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్‌గా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన పాట గా ఇది నిలిచింది.కేవలం 14 రోజుల్లోనే ఈ మార్కును చేరుకొని సత్తా చాటింది సారంగా దరియా.ఈ పాటకన్నా ముందు ఒకే ఒక పాట ఉండడం అది కూడా సాయి పల్లవిదే కావడం విశేషం.తమిళ్ మూవీ ‘మారీ’లోని రౌడీ బేబీ.పాట కేవలం 8 రోజుల్లోనే 50 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది.ఆ తర్వాత స్థానాన్ని’సారంగ దరి యా’ఆక్రమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here