భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి. ట్రెసా

జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.డీ.వకీల్, అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ లు తీవ్రంగా ఖండించారు. శనివారం వారు రెవెన్యూ భవన్ లో మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ, పురికొల్పిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు జిల్లాల్లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూశాఖ ఉద్యోగులకు, అధికారులకు ప్రభుత్వ భూముల పరిరక్షణ లో పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, కోశాధికారిగా ఎన్. తిరుమల రావ్, రమేష్ , రాజేందర్ రావ్, రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, అబూబాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here