కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు..

కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు..

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవాలని రైతులు ఆరాటపడుతున్న నేపథ్యంలో, ఒకపక్క ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మరోపక్క శివమణి పారా బాయిలర్ రైస్ మిల్ నుండి వెదజల్లే పొగ, వేడినీరు వల్ల వేసుకున్న పంట ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లందని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని మీడియాకు తెలిపారని, మిల్లు యాజమాన్యం రైతులు తమ పంట పొలాలకు వెళ్లే దారిలో
జెసిబి తో కందకాలు తవ్వడం తో మంగళవారం రాయికల్ నుండి కోరుట్ల వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు
ఆందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

tajakaburu
tajakaburu

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ శివారులో ఉన్న శివమణి బాయిలర్ రైసుమిల్లు వల్ల వెదజల్లె పొగ,వేడినీరు,ఇతర చెడు పదార్థాల వల్ల ఆ ప్రాంతంలో ఉన్న వరి,మొక్కజొన్న, మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులకు వాటినుండి వచ్చె వ్యర్థాల వల్ల పంటలన్నీ ఎండిపోయాయి, ఎదుగుదల ఆగిపోయింది,సుమారు యాబై ఎకరాల్లో రైతులు తమ పంట నష్టపోయారు, దాంతో‌ తమకు న్యాయం చెయ్యాలని ఎన్నీసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, మిల్లు యాజమాన్యం రాజకీయ పలుకుబడితో రైతులు నష్ట పోయిన పట్టించుకోవడంలేదని
తమకు న్యాయం జరగాలని కోరుతూ రాయికల్ల్ నుండి కోరుట్ల వెళ్లే ప్రధాన రహదారి పై గ్రామ రైతులు 4 గంటలపాటు ధర్నా కు దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ఎంపిటిసి రాజనాల మధుకుమార్ రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here