బిగ్ బాస్ ఫేం గంగవ్వకు ప్రభుత్వం పెన్షన్ అందించాలి… కళాశ్రీ అధినేత గుండేటి రాజు…

బిగ్ బాస్ ఫేం గంగవ్వకు ప్రభుత్వం పెన్షన్ అందించాలి… కళాశ్రీ అధినేత గుండేటి రాజు…

తాజాకబురు సినిమా:బిగ్ బాస్ ప్రదర్శనతో తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన బిగ్ బాస్ గంగవ్వ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరించాలని, ఆమెకు ప్రత్యేకంగా కళాకారుల పెన్షన్ ప్రతి నెల పదివేల రూపాయలను తక్షణమే అందించాలని కళాశ్రీ అధినేత గుండేటి రాజు కోరారు. ఈరోజు మల్యాల మండలం లంబాడిపల్లి చెందిన గంగవ్వ స్వగృహంలో జగిత్యాల కళా సంస్థల ప్రతినిధులు కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ అధినేత గుండేటి రాజు, గానకోకిల ప్రతినిధి మాన్యం రవికుమార్, గొల్లపెల్లి శ్రీ రాములు గౌడ్, గాయకుడు రాపర్తి రవి ఘనంగా శాలువతో సత్కరించారు. భవిష్యత్తులో గంగవ్వ కు ఎలాంటి సహాయమైనా అందిస్తామని కళా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మై విలేజ్ షో నటులు అనిల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here