నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా ఆలయంలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పండుగలను విశ్వవిఖ్యాతం చేసిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత దే అని అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.పి గంగారాం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర రావు, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి ,సందీప్ రావు,అర్బన్ జడ్పీ.టీ.సీ మహేష్, వైస్ ఎం.పీ.పీ రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, రూరల్,అర్బన్ మండలాల తెరాస పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.