కోరిన కోర్కెలు తీర్చుతున్న కొత్తపేట నాగన్న

ఘనంగా 4 రోజుల జాతర ఉత్సవాలు

నాగాలయ పరిసర ప్రాంతాల్లో జాతర ఏర్పాట్లు

ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు జాతర ఉత్సవాలు

జగిత్యాల మార్చి 11, తాజా కబురు ప్రతినిధి:కోరిన కోర్కెలు తీర్చే కొత్త పేట నాగన్న తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామానికి ( కొత్తపేట వడ్డెర కాలని )దక్షిణ భాగం లోని శంకు మూలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శివ గంగ నది ఒడ్డున 6 ఎకరాల మామిడి తోటలో స్వయంభుగా వెలసి కొలిచిన భక్తుల కోర్కెలు తీర్చుతునరని భక్తుల విశ్వాసం .

శ్రీ రాజరాజేశ్వర నాగాలయ చరిత్ర

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట, మూటపెల్లి గ్రామాల మధ్య అర కిలోమీటర్ల దూరంలో శివ గంగా నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వస్తిశ్రీ శ్రీముఖ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ సప్తమి 20 డిసెంబర్ 1993 సోమవారం రోజున స్వయంభుగా శ్రీ రాజరాజేశ్వర నాగాలయం ఏర్పడింది. మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఒక గిరిజన వ్యక్తి మామిడి తోట లోని దారి గుండా కాలినడకన వేంపల్లి గ్రామానికి వెళ్ళుచుండగా దారికి అడ్డంగా ఒక పెద్ద నాగసర్పం కబడి ముందుకు పోనివ్వకుండా పడగ విప్పి దారికి అడ్డం నిలబడగా కర్రతో పామును కొట్టి చంపాలని ఎంత ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు.ఏదో విధంగా ఆయన గ్రామానికి వెళ్ళాడు. మరుసటి రోజు కొత్తపేట గ్రామానికి అదే దారి గుండా వస్తుండగా మళ్లీ మొదటి లాగానే పాము వచ్చి అదే విధంగా చేయడం జరిగింది. అతడు బాగా ఆలోచించి ఈ పాము దేవుని పాము అనుకుని నా పూజ కొరకు ఎదురుచూస్తున్నదని భావించి నేను ఇంటికి వెళ్లి శుభ్రంగా స్నానం చేసి కొబ్బరికాయలు తీసుకుని వచ్చి నీ పూజ చేస్తానని మ్రొక్కడం జరిగింది. మ్రోక్క గానే దగ్గరలో ఉన్న పుట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఆయన మొక్కిన విధంగానే పుట్ట దగ్గరకు వచ్చి పూజలు చేసి తనకున్న బాధలను చెప్పుకోవడం జరిగింది. మొక్కిన కోర్కెకలు తీరగానే కోర్కెలు తీర్చిన చల్లని దేవుడు నాగన్న అని పుట్ట మీద పందిరి వేసి పూజలు చేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో గుడి ఆవరణంలో పుట్ట పైన పట్టపగలు పాల వర్షం పడిందని భక్తులు, గ్రామస్తులు చెప్తుతుంటారు.
కాలక్రమేణా ఆ చిన్న పందిరి నేడు గొప్ప దేవాలయంగా ఏర్పడి మంచి పర్యాటక క్షేత్రంగా కొలిచిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు నాగాలయంగా వెలుగొందుతున్నాడు. ఈ దేవాలయంలో ఆలయ పురోహితులు చెరుకు రాజేశ్వర శర్మ ,అజయ్ శర్మ ల ఆధ్వర్యంలో ధూప, దీప, నైవేద్యాలతో నిత్యం దేవుని పూజలు జరుగుతున్నాయి.
01మార్చి2002 నుండి ఈ ఆలయం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఆధ్వర్యంలో ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ సర్వ శ్రేయోనిధి ద్వారా ప్రభుత్వ గ్రాంటు లతో ఆగమ శాస్త్రానుసారం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఆదాయం కలిగిన శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో ఆంజనేయ స్వామి, నవగ్రహాల మండపం, అల్లు బండ, పోచమ్మ గుడి, మల్లన్న గుడి, ఎల్లమ్మ గుడి,శివగంగా నది ఒడ్డున గంగమ్మ గుడి ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో గండదీపం,గోపుర నిర్మాణాలు పూర్తయ్యాయి.

మహా శివరాత్రి పూజలు

మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఈనెల 10 బుధవారం రోజు నుండి 13వ తేదీ శనివారం వరకు జరుగుతాయి. పాలకవర్గం, ఆలయ అధికారులు ఆలయంలో ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర మాఘ త్రయోదశి తేది:10 -03-2021బుదవారం రోజున పుణ్యావచనం , అఖండ దీపారాధన, ధ్వజారోహణం , తేదీ 11-03-2021 గురువారం రోజున పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం,అభిషేకం, బిల్వార్చన తేదీ: 12-03-2021 శుక్రవారం రోజున స్వామి వారి అభిషేకం, నవగ్రహ ,రుద్రాభిషేకం, హోమం, తేదీ:13-03-2021 శనివారం రోజున స్వామివారికి రుద్రాభిషేకం ,శ్రీ స్వామి వారి రథోత్సవం, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు ,కొత్తపేట వడ్డెర కాలనీ సర్పంచ్ లు బత్తిని రాజేశం గౌడ్ , మన్నెగుండ్ల వెంకమ్మ నర్సయ్య , ఎంపీటీసీ శ్రీనివాస్ ,నూతన ఆలయ కమిటీ చైర్మన్ కొక్కుల రామచంద్రం ,మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయికల్, మల్లాపూర్, జగిత్యాల, కోరుట్ల డిపోల నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవం జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here