విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?

హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ .”400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్‌లు నడిపించాడా”అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్ ట్వీట్ చేశారు.గురుత్వాకర్షణ శక్తి వలన విద్యుత్తు లేకుండా కూడా ఫౌంటైన్లు నడవడం సాధ్యమని అనీష్ గోఖలే సహా చాలా మంది ఆమెకు సమాధానమిచ్చారు.ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిజంగానే విద్యుత్తు లేకుండా ఫౌంటైన్లు పనిచేస్తాయా? ఈ వాదనలో నిజమెంత?ఫౌంటైన్లు ఎలా పనిచేస్తాయి?నీరు పల్లానికే ప్రవహిస్తుందన్నది మనకు తెలిసిన విష యమే.దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి.చిన్నపిల్లలు నీళ్ల పైప్‌తో ఆడుకోవడం చూసే ఉంటారు కదా.పైపులోంచి నీళ్లు వస్తున్నప్పుడు ఒకవైపు గట్టిగా నొక్కితే మరో వైపు ఫౌంటైన్‌లా నీరు పైకి ఎగిసి కిందకు పడుతుంది.రబ్బరు పైపుని నొక్కితే,నీళ్ల వేగం పెరుగుతుంది.దాంతో,గొట్టం చివర ఒత్తిడి పెరుగుతుంది.నీళ్లు ఫౌంటైన్‌లా విచ్చుకుని బయటకు వస్తాయి.ఈ టెక్నిక్ ద్వారా తా జ్ మహల్,కాశ్మీ ర్‌లోని మొఘల్ గార్డెన్స్ లేదా ఎర్రకోటలో ఫౌంటైన్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు.వీటిలో కొన్ని మీరు చూసే ఉంటారు.ఇవన్నీ కూడా కరెంట్ లేని కాలంలో కట్టినవి.మన కు విద్యుత్ రావ డానికి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి.ఫౌంటైన్ తయారీలో,మొదట నీళ్లు ఒకచోట నిల్వ ఉండేలా చూస్తారు.అక్కడి నుంచి ఇరుకైన మార్గాల్లో నీరు ప్రవహించే ఏర్పాటు చేస్తారు.దాని వలన నీటి పీడనం పెరుగుతుంది.వేగంగా ప్రవహించి రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది.అదే ఫౌంటైన్.నీటి వేగం,ఫౌంటైన్ డిజైన్ వలన అది ఎంతో అందంగా కనిపిస్తుంది.ఫౌంటైన్ నిర్మాణం:అర్బన్ ప్లానర్ శుభమ్ మిశ్రా ఫౌంటైన్ ఎలా నిర్మిస్తారో వివరించారు.”మొఘలుల కాలంలో ఫౌంటైన్ తయారీకి టెర్రకోట పైపులు ఉపయోగించేవారు.దీనిలో వంపులు ఎంత కచ్చితంగా పెట్టేవారంటే నీటి ప్రవా హానికి ఏ అడ్దంకి ఉండేది కాదు.నేరుగా ఫౌంటైన్ కన్నాల్లోంచి ఎగిసి పడేది.ఫౌంటైన్ నిర్మాణంలో నీటి వేగాన్ని గణించడం చాలా ముఖ్యం.దీనిలో లెక్కలు,క్రమం తప్పకుండా నీరు ప్రవహించడం,ఫౌం టైన్‌లోంచి బయటకు చిమ్మడం చాలా అద్భుతమైనది” అని ఆయన వివరించారు.టెర్రకోట అంటే నిప్పుల్లో కాల్చిన మట్టి.”మొఘల్ చక్రవర్తుల భవనాలలో నిర్మించిన ఫౌంటైన్లలో గురుత్వాకర్షణ శక్తి, హైడ్రోలాజికల్ సిస్టంలను ఉపయోగించారు” అని చరిత్రకారుడు రానా సఫవీ చెప్పారు.నీటి వనరుల లభ్యత,వినియోగంపై ఆధారపడే వ్యవస్థ ఇది.నీటి ప్రవాహ ప్రక్రియ భూమి వినియోగం,నేల,వర్షపా తం,బాష్పీభవనం లాంటి అంశాలను పరిగణిస్తారు.”మొఘలుల ఆర్కిటెక్చర్‌లో సమాధి అయినా,మసీదు అయినా దానిలో నీటి కాలువ చాలా ముఖ్యమైనది.సమాధి నాలుగు తోటల మధ్యలో ఉం టుంది.అక్కడక్కడా ఫౌంటైన్లు ఉంటాయి.హుమాయున్ సమాధి,కశ్మీర్‌లో తోటలు ఇలాగే నిర్మించారు.ఎర్రకోటలో నహర్-ఎ-బహిష్ట్ ఉండేది.ఇది ఎర్రకోట అంతటా ప్రవహించేది.దీనికి మధ్య మధ్యలో ఫౌంటైన్లు ఉండేవి.దీని కోసం యమునా నది నుంచి నీటిని సేకరించేవారు.నహర్-ఎ-బహిష్ట్ నుంచి ఫౌంటైన్లలోకి నీరు చేరేది.జామా మసీదులో కొలనుకు నీటిని తీసుకురావడానికి రహట్ బావి ఉం డేది.అది నేటికీ ఉంది” అని రానా సఫవీ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here