రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఒద్ది రాజు ర‌విచంద్ర‌ ఏక‌గ్రీవం

హైదరాబాద్:రాజ్య‌స‌భ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ప‌త్రాన్ని స్వీక‌రించారు.ఈ సందర్భంగా వద్దిరాజు ర‌విచంద్ర‌ను అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు,ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌,ఎమ్మెల్సీ,రైతు బంధు స‌మితి చైర్మ‌న్ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి,మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత‌,ఎమ్మెల్సీ తాతా మ‌ధు,వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ తదితరుల సమ క్షంలో ఎన్నిక పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి న‌ర్సింహ‌చార్యుల చేతుల మీదుగా స్వీక‌రించారు.అనంత‌రం నేత‌లంతా ఒద్దిరాజు ర‌విచంద్ర‌కు అభినంద‌న‌లు,శుభాకాంక్ష‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here