అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..

హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్త కొత్త వాటిని ప్రసాదంగా ఇవ్వడం వినే ఉంటాము.తాజాగా ఇప్పుడు ఓ ఆలయంలో మాత్రం దైవ దర్శనం కోసం వెళ్ళిన భక్తుల కు మాత్రం బంగారు నాణెం లేదా వెండి,డబ్బులను ప్రసాదంగా ఇస్తున్నారట.ఏంటీ నిజమా అని ఆశ్చర్య పోకండి.మీరు విన్నది అక్షరాల నిజం అక్కడ ఓ అమ్మవారి ఆలయంలో ప్రసాదంగా వస్తువు లను,డబ్బులను ఇస్తున్నారట.ఈ ఆలయం కూడా మన దేశంలోనే ఉందట.ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో బంగారం,నగదును ప్రసాదంగా ఇస్తారు.మధ్యప్రదేశ్ లో ఉన్న రత్లామ్ మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడువునా భక్తులతో రద్దీగా ఉంటుంది.అమ్మవారికి భక్తులు నగలు,కోట్లది రూపాయల నగదు,వెండి ఆభరణాలు సమర్పించుకుంటారు.అలా అమ్మవారికి ఇస్తే అమ్మవారు మళ్ళీ ఆ సొమ్మును డబుల్ చేస్తుందని నమ్ముతున్నారు.అమ్మవారికి ఏది సమర్పించినా అది రెట్టింపవుతదని భక్తుల నమ్మకం.ఈ ఆలయానికి కుబేరుని నిధిగా పేరు ఉంది.దీపావళి సందర్భంగా ఈ ఆల యంలో ఐదు రోజులపాటు దీపోత్సవం నిర్వహిస్తారు.ఆ సమయంలో పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు,డబ్బులతోనే అలంకరిస్తారు.అదేవిధంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకు న్న తర్వాత ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లరు.ఎందుకంటే భక్తులకు బంగారం,వెండి లేదా డబ్బులు ఇలా ఏదో ఒకటి ప్రసాదంగా ఇస్తారట.భలే ఉంది కదా ఇంకో విషయం ఏంటంటే అక్కడ అమ్మ వారికి కానుకలు ఇచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ.అందుకే ఆలయం మొత్తం డబ్బు,బంగారు,వెండి వస్తువులతో నిండిపోయి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here