తోటపల్లి, జనగామ గుడిబండ ఓ చరిత్రాత్మక ఘట్టం!

హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి జనగామ గ్రామాలకు నుదుటన బొట్టు లా అనుకోని వున్నా ఎత్తయిన కొండ..
ఓ ప్రక్క చంద్రవంకలా. ఇరు గ్రామాలకు మెడలో మణిహారం లా, ఎల్లమ్మ చెరువు ఈ రెండు గ్రామశివారులో ఎత్తయిన కొండ,శిశిర ఋతువులోనే కనిపించే ఎర్ర మందారాలవలె మోదుగు పూలవనం, ఆ వనం లో ఎత్తయిన కొండపై గుడి. దానినే “గుడి బండ” అని పిలుచుకుంటారు ఇరు గ్రామాలకు సరిగ్గా అర కిలో మీటరు దూరంలో 300 సంవత్సరాల క్రితం నాటి ఆ కొండపై శివ లింగం వెలిసిందని, కాకతీయుల కాలంలో ఆలయం ఏర్పాటు చేయబడిందని,ఇక్కడి ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు, ఇక్కడి ఎత్తయిన కొండ దాదాపు మండలంలోని చుట్టూ పది గ్రామాలకు కనబడి చూపరులను ఆకర్షించే విదంగా ఉంటుంది గతంలో శ్రావణ మాసంలో చుట్టు పక్కల గ్రామాలవారు వనబోజనాలకు పెద్దయెత్తున, వచ్చి, కొండకు తూర్పు బాగానే ఉన్నా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకొని కొండ పై భాగం నుండి కిందవరకు పాయసం పోసేవారు అనంతరం శివ పార్వతులను దర్శించుకొని,ఇక్కడి ప్రకృతి అందాలల్లో పిల్లా పాపలతో కాల క్షేపం చేసి మానసికొల్లాసంతో వన విహారం చేసేవారు పసి పిల్లలకు

“పిట్ట కాళ్ళు”విష సర్పాలు కాటు వేస్తే ఆయుర్వేద చెట్లమందులు తీసుకు వెళ్లేవారు ,ఇక్కడ సాధువులు నివసించే వారు,ఎక్కడ పిడికెడు మట్టి దొరకని ఈ కొండపై “గుండం “లో కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు నీరు వుండటం శివ మాయే అని పెద్దల చెబుతుంటారు,

మధ్యా కాలంలో కొంత మరుగున పడ్డప్పటికి మళ్ళీ పూర్వ వైభవంతో గుడి చుట్టూ ఎడ్ల బండ్లతో అంగరంగ వైభవంగాఏటా ఈ కొండపై మహాశివరాత్రి పూజలు పెద్దయెత్తున చేపడుతున్నట్లు ఆలయ పూజారి,చెప్పుకొచ్చారు వేములవాడ, పోట్లపల్లి,రాజరాజేశ్వరి స్వామి ఆలయాల కన్నా ఇక్కడి ప్రకృతి అందాలు బౌగోళిక పరిసరాలు కనుల విందుగా వుంటాయని ఈ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆలయ పూజారులతో సహా,భక్తులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here