అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభం…

రాయికల్ టౌన్: అయోధ్యలో రెండు ఎకరాల కు పైగా ఉన్న విస్తీర్ణంలో భవ్య రామాలయ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ప్రతి భారతీయుడు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సదుద్దేశంతో “శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం” విరాళములు సేకరిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం రోజున రాయికల్ పట్టణానికి చెందిన గోసికొండ లక్ష్మి- నారాయణ దంపతులు వారి కుమారుడు నాగరాజు తో కలిసి 50116/- రూపాయలను విరాళంగా ఇచ్చి వారి దాతృత్వాన్ని నిరూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ఈ సమర్పణ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం సంయోజకులు తోపారపు రవీందర్, డాక్యుమెంటరీ ప్రముఖ్ ఎద్దండి రాజు, కార్యవర్గ సభ్యులు కుర్మా మల్లారెడ్డి , వీరబత్తిని శంకర్, మామిడాల నరేందర్, ఎద్దండి నివేదిత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here