జల్సాలకోసం పందులను అమ్ముకున్న నలుగురు యువకులు…..

జల్సాలకోసం పందులను అమ్ముకున్న యువకులు…..

• రూ. 60 వేలకు అమ్ముకుని పంచుకున్న నలుగురు…
• రోజురోజుకు మాయమవుతున్న పందులు,పోలిసులకు ఫిర్యాదు…

నయీంనగర్: జల్సాలకు బానిసైన నలుగురు వ్యక్తులు డబ్బులకోసం పందుల దొంగతనానికి పాల్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించేందుకోసం రెండునెలల్లో 25 పంది పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని పైడిపల్లికి చెందిన పులిచేరి చిన్నబాబు, పులిచేరి రాకేశ్ అలియాస్ చింటు,దుగ్యాల రాజు, పల్లకొండ రణశివ చెడు అలవాట్లకు బానిసయ్యారు. దీంతో డబ్బుల కోసం గత నవంబర్, డిసెంబర్ నెలల్లో 25 పంది పిల్లలను దొంగిలించి ఆటోలో ఎత్తుకెళ్లి మల్లంపల్లి, నర్సంపేట అంగడిళ్లలో అమ్ముకున్నారు. అలా రూ.60 వేలు రావడంతో రూ.15 వేల చొప్పున పంచుకున్నారు. పందుల యజ మానుల ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు పైడిపల్లిలో మళ్లీ పందులను దొంగిలించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితుల
నుంచి రూ.60 వేల నగదు, ఆటోను స్వాధీనంచేసుకున్నట్లు సీసీఎస్ ఇన్ స్పెక్టర్ఎల్.రమేశ్ కుమార్, హసన్‌పర్తి ఎస్సై జితేందర్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here