12 మంది భాజపా ఎమ్మెల్యేలపై ఏడాది పాటు బహిష్కరణ

ముంబై:మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి.ఓబీసీ రిజర్వేషన్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష బీజేపీ సభ్యు ల పట్టుబట్టారు.అంతేగాక,మహారాష్ట్ర అసెంబ్లీ ఇంఛార్జీ స్పీకర్ భాస్కర్ జాదవ్‌పై కొందరు బీజేపీ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు.దీంతో వారిపై చర్యలు తీసుకున్నా రు.ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.రెండు రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సోమవా రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అసెంబల్ీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.దీనిపై చర్చ జరగాల్సిందేనని బీజేపీ సభ్యులో ఆందోళనకు దిగారు.దీంతో కొంతసేపు స్పీకర్ సభను వాయిదా వేశారు.అదే సమయంలో స్పీకర్ క్యాబిన్‌కు వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు ఆయనపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది.ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్,బీజేపీ సీనియర్ నేత చంద్రకాత్ పాటిల్ సమక్షంలోనే బీజేపీ సభ్యులు తనపై దాడికి యత్నించినట్లు స్పీకర్ భాస్కర్ ఆరోపించారు.సభా కార్యకలాపాలు అడ్డుకున్నందుకే 12 మంది ఎమ్మల్యేలను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.మరోవైపు,స్పీకర్ అవాస్తవాలు చెబుతు న్నారని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను దూషించలేదని స్పస్టం చేశారు.స్పీకర్ క్యాబిన్‌లో కేవలం శివసేన,బీజేపీ సభ్యుల మ ధ్య వాదనలు మాత్రమే జరిగాయని తెలిపారు.అందుకు స్పీకర్‌కు బీజేపీ సభ్యులు క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.కేవలం బీజేపీ సభ్యులను మాత్రమే సస్పెం డ్ చేయడంలో ఆంతర్యమేంటని ఫడ్నవీస్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here