కరీంనగర్:చేపలు వచ్చాయి చేపలు అంటూ ఒక రోజు మొత్తం వినిపించే పదం.ఇక ఆరోజు చేపల కర్రీ తినని వారు ఉండరూ ఇంతకీ అది ఏరోజు అనుకుంటున్నారా మృగశీర కార్తీక.ఈ రోజు వచ్చిదం టే చాలు పల్లెల్లో చెరువుల వద్ద సందడి కనిపిస్తుంటుంది.ఎందుకంటే మృగశిర తొలి రోజు చేపలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు.అంతే కాకుండా ఆరోజు చేపలు తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదంట.అందువలన ఆనాది కాలం నుంచి ఈ పద్ధతి అమలులో ఉంది.అసలు మృగశిర రోజు చేపలు ఎందుకు తినాలి.చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.అంతే కాకుండా వీటిని తినడం వలన అనేక వ్యాధులు దూరమవుతాయంటారు.అయితే ఎండకాలం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.దీంతో శరీరంలో వేడి ఉండేందుకు చేపలు తిం టారు.అంతే కాకుండా చేపలు ఆస్తమా పేషంట్లకు మంచి ఔషదంగా చెప్పవచ్చు.
