హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య,సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు కారణమైంది.విడాకులకు చాలా కారణాలు ఉన్నాయంటున్నా అందులో స మంత పర్సనల్ స్టైలీష్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకరని అతడితో సమంత స్నేహంగా ఉండడం పైగా సమంత బర్త్ డే రోజు తన కాళ్లు అతడి ఒళ్లో పెట్టుకుని పడుకున్న ఫొటోలు పోస్ట్ చే యడంతో రకరకాల సందేహాలు వస్తున్నాయి.విడాకులు ఇచ్చాక అవి ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయి.దీంతో అసలు ఈ ప్రీతమ్ ఎవరు ? సమంతకు ఎలా ? పరిచయం అంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి.ఇతడిది హైదరాబాద్.వయస్సు కూడా సమంతకు ఈక్వల్‌గా 33.ఫ్యాన్ డిజైనింగ్‌పై ఆసక్తితో ఫ్యాషన్ అండ్ టెక్స్ టైల్స్‌లో డిగ్రీ చేశాడు.అతడి తల్లి చిన్నప్పుడు బట్టలు కుట్టేవారు.దీంతో ప్రీతమ్ కూడా అదే మిషన్‌పై బట్టలు కుట్టే క్రమంలోనే ఫ్యాషన్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తయ్యాక భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా కొన్ని డిజైన్స్ చేశాడు.సమంతకు చేనేత వస్త్రాలు అంటే ఆసక్తి ఎక్కువ.ఈ క్రమంలోనే ఆమె చేనేత వస్త్రాలను ప్రోత్సహించే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేపట్టిన ఓ కార్యక్ర మానికి మద్దతు ఇచ్చింది.అక్కడే ప్రీతమ్ జుకల్కర్‌కి సమంతతో పరిచయం ఏర్పడింది.చివరకు వారిద్దరు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.అయితే ప్రీతమ్ కేవలం సమం తకే కాదు రకుల్,రాశీఖన్నాకు కూడా స్టైలీష్ట్‌గా ఉన్నాడు.సమంత బయట పలు షోలకు వెళ్లినప్పుడు సమంతకు ఎన్నో డిజైన్లు తయారు చేసి ఇచ్చాడు.వీటి వల్ల అతడికి మంచి పేరు రావడంతో పాటు డిమాండ్ కూడా ఏర్పడింది.
