ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి..శిక్ష ఏంతో తెలుసా?

న్యూయార్క్:ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు విధిస్తున్న అమెరికా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.2018లో మేరీల్యాండ్ క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రి క కార్యాలయంపై దాడికి పాల్పడి ఐదుగురు పాత్రికేయులను కాల్చి చంపిన కరడుగట్టిన జార్రోడ్‌ రామోస్‌ అనే హంతకుడికి న్యాయస్థానం ఐదు యావజ్జీవ శిక్షలు విధించిన ఈ తీర్పు సంచలనంగా మారింది.మూడేళ్ల క్రితం అంటే 2018లో ఐదుగురు పాత్రికేయులను దారుణంగా కాల్చిచంపిన హంతకుడు జీవిత కాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జార్రోడ్‌ రామోస్‌ జైలు నుం చి విడుదల కాకుండా కఠిన శిక్షలు విధించింది.ఐదు యావజ్జీవ శిక్షలతో పాటు మరో 345 ఏళ్లు కారాగారంలోనే ఉంచాలని అన్నె అరండెల్ కౌంటీ జడ్జి మైఖేల్ వాష్ ఆదేశించారు.అంటే ఒక వ్యక్తి అంతకాలంపాటు జీవించి ఉంటాడని కాదు.కానీ చేసిన నేరం తీవ్రతను బట్టి కోర్టులు కొన్ని కీలక కేసుల్లో ఇటువంటి అంత్యం సంచలన తీర్పులు విధిస్తుంటాయి.అటువంటి కేసే ఈ జార్రోడ్ రామోస్ కేసు.స్వల్ప కాలం జైలు బయటకు అనుమతించే పెరోల్‌ వంటి సదుపాయాన్ని కూడా హంతకుడికి కల్పించవద్దని స్పష్టం చేస్తూ అన్నె అరండెల్‌ కౌంటీ జడ్జి మైఖేల్‌ వాష్‌ తీర్పునిచ్చారు.కాగా 2018 జూన్ 28న మేరీల్యాండ్ క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయంపై హంతకుడు జార్రోడ్ రామోస్ న్యూస్ రూమ్ లోకి తుపాకితో దూసుకెళ్లాడు.అలా దూసుకెళ్లిన జార్రోడ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడున్న జర్నలిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో మరణించిన జర్నలిస్టులు 56 ఏళ్ల మె క్‌నమారా,65 ఏళ్ల వెండి వింటర్స్,61ఏళ్ల జెరాల్డ్ ఫిష్‌మన్,59 ఏళ్ల రాబ్ హియాసెన్,34 ఏళ్ల రెబెక్కా స్మిత్ ప్రాణాలు కోల్పోయారు.ఈ దాడి అమెరికా జరిగిన అత్యంత గోరమైన దాడు ల్లో ఒకటిగా నిలిచిపోయింది.గతం తాను పాల్పడిన ఓ నేరానికి సంబంధించిన వివరాలను క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రికలో ప్రచురించారనే ఆగ్రహంతో రగిలిపోయిన హంతకుడు జార్రోడ్ ఆ ఆఫీసుపై దాడికి దిగి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నారు.ఈ కేసు తీర్పుని వెలువరించే ముందు న్యాయమూర్తి మృతుల కుటుంబ సభ్యుల ఆవేదనను విన్నారు.అనంతరం ఈ సంచలన తీర్పునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here