ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా..?

హైదరాబాద్:ఎమ్మెల్యే కోట,గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు.సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం వరకే పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా మంగళవారం ఉద యం వరకు ప్రకటించలేదు.అధికార పార్టీలో ఆశావహులు అధికంగా ఉండడంతో సీఎం సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం.ఇన్నాళ్లు ఎవరి పేర్లు ఉంటాయోనని టీఆర్ఎస్ శ్రేణులు కం టిమీద కునుకు లేకుండా వేచి చూశారు.రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరించింది.పోటీ తీవ్రంగా ఉన్నం దున,గతంలో ఇచ్చిన హామీతో పాటు సామాజిక రాజకీయ సమీకరణలతో కుస్తీ చేశారు.ముందస్తుగా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లకు అవసరమైన పత్రాలను సి ద్ధం చేసుకోవాలని సూచించినా మంగళవారం ఉదయం ఖరారు అభ్యర్థులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగియ నున్న నేపథ్యంలో వీరంతా 11 గంటల అనంతరం నామినేషన్ వేయనున్నారు.ఖరారు అయిన అభ్యర్థులు వీరేనా..కడియం శ్రీహరి(వరంగల్),తక్కళ్లపల్లి రవీందర్ రావు (మహబూబా బాద్),గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ),పాడి కౌశిక్ రెడ్డి (కరీంనగర్),మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి(సిద్ధిపేట)బండ ప్రకాష్ ఖరారు అయినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here