హైదరాబాద్:కేంద్రం మరియు తెలంగాణ రాష్ట్రం బియ్యం-కయ్యం.తెలంగాణ లో ఈ యాసంగిలో 100 క్వింటాల్స్ వడ్లు పండాయి.వాటిని మిల్లులో పడితే 65 క్విం టాల్స్ బియ్యం వస్తా యి.కాని యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది అందువలన ఉడకబెట్టి బియ్యం తీస్తారు.ఇలా ఐతే 80 క్వింటాల్స్ బాయిల్డ్ బియ్యం వస్తాయి.అంటే అదనంగా 15 క్వింటాల్స్ బియ్యం వస్తున్నాయి.ఇక్కడే అసలు కథ ఉన్నది.కేంద్రం-రాష్ట్రం ఒప్పందం ప్రకారం ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి.ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు.కాని బాయి ల్డ్ ఎప్పుడూ కూడా తక్కువ రాదు.మరి ఇక్కడ 15 క్వింటల్స్ బియ్యం ఎక్కువ వచ్చాయి.ఎక్కువ వచ్చాయని కేంద్రానికి చెప్పదు.ఉచితంగా కూడా ఇవ్వదు.ఆ 15 క్వింటాల్స్ బి య్యం కు కూడా సరిపడే వడ్లకు లెక్కను చూపిస్తుంది.అంటే 15 క్వింటాల్స్ బియ్యం రావడానికి 25 క్వింటాల్స్ వడ్లు కొన్నట్లుగా చూపుతుంది.తెలంగాణ మొత్తం కొన్న వడ్లు 125 క్వింటాల్స్ అని అవాస్తవ లెక్క చూపుతుంది.మీది 25 క్వింటాల్స్ అప్పనంగా వచ్చినట్లే కదా!అప్పనంగా వచ్చినా కూడా కేంద్రం నుండి ప్రతి క్వింటాల్ కి మద్దతు ధర 1960/-మిల్లు చార్జి 250/-రవాణా చార్జ్ 250/-హమాలీ&సుతిలీ 60/-ఇతరములు 40/-మొత్తం:₹ 2560/-కేంద్రం ఇస్తుంది.వాస్తవానికి తెలంగాణ రైతుల నుండి కొన్నది 100 క్వింటాల్స్ మా త్రమే.కాని కేంద్రానికి లెక్క చూపిస్తున్నది 125 క్వింటాల్.25 క్వింటాల్స్ కి అప్పనంగా వస్తున్న ఆదాయం అక్షరాల ₹ 64000 ఇక అసలు తెలంగాణ పంటకు వద్దాం.తెలంగాణ 2020 యాసంగి పంట 10000000 కోటి మెట్రిక్ టన్నులు అంటే పది కోట్ల క్వింటాల్స్ 100000000 స్కాం ప్రకారం 125000000 తేడా 2500000 క్వింటా ల్స్ కాని కేంద్రం నుండి మాత్రం 125000000 x 2560= 320000000000 (ముప్పై రెండు వేల కోట్లు) వసూలు చేస్తుంది.వాస్తవానికి రైతులకు ఇచ్చేది 100000000 x 1960 = 196000000000 పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు మాత్రం మాత్రమే.ఇక్కడ తేడా మిగిలేది 124000000000 (పన్నెండు వేల నాలుగు వందల కోట్లు) వీటిని అన్నింటిని రైస్ మిల్లర్లు మరి ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయకులు,అవినీతి అధికారులు పంచుకుంటారు. ఇలా ఏడు సంవత్సరాల నుండి దందా కొనసాగుతున్నది.అందుకే బాయి ల్డ్ రైస్ వద్దన్నందుకు ఇంత రాద్దాంతం అంటున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...