ముంబై:అది లక్షల రూపాయల బైకే.కానీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.ఎందుకలా? దానిపై పోప్ ఫ్రాన్సిస్ సంతకం చేశారు మరి.పైగా,అది ప్రపంచంలోనే పెరెన్నికగన్న హార్లే డేవిడ్సన్ బైక్. దీని సామర్థ్యం 1585 సీసీ.హార్లే డేవిడ్సన్ బైకులను ప్రారంభించి 110 ఏళ్లయింది.ఇందుకు గుర్తుగా ఆ సంస్థ పోప్ కు ఈ బైక్ ను బహుమానంగా అందించింది.ఆయన పేదల సంక్షేమం కోసం పని చేసే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు.ఆ సంస్థ తరఫున బాన్ హమ్స్ ఫ్రాన్స్ లోని పారిస్ లో బైక్ ను వేలానికి పెట్టగా 2.84లక్షల డాలర్ల (1.76 కోట్ల రూపాయల)కు అమ్ముడుపోయింది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...