కాఫీతో కోవిడ్ టెస్టా..అదెలా అబ్బా..!!

0
318

న్యూఢిల్లీ:ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదనే చెప్పాలి.ఒకవేళ మీకు కనుక కరోనా లక్షణాలు ఉంటే మీరు ఎక్కడికి వె ళ్లనవసరం లేదు.మీ ఇంట్లోనే ఎంచక్కా కరోనా టెస్ట్ చేసుకోవచ్చు తెలుసా.అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు.చాలా సింపుల్ ప్రాసెస్ అండి అది. మీకు డైలీ కాఫీ తాగే అలవా టు ఉండే ఉంటుంది కదా.ఎందుకంటే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది.ఎలాగంటే కరోనా లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే రుచి తెలియకపోవడం,వాసన పసిగట్టలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.ఈ లక్షణాలను బట్టి వారికి కరోనా సోకిందని గుర్తించవచ్చు.అసలు దీనికి, కాఫీకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా.సంబంధం ఉంది అండి.ఒకవేళ మీరు కనుక కరోనా బారిన పడితే మీరు కాఫీని స్మెల్ చేయలేరు సరి కదా దాని సువాసన భరితమైన రు చిని కూడా ఆశ్వాదించలేరు.ఒకవేళ కరోనా లక్షణాలు మీలో లేకుంటే మీరు కాఫీని రుచి,వాసనను ఆస్వాదించగలరు.ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా మీకు కరోనా సోకిందో లేదో ఇట్టే తెలు సుకోవచ్చు.కాఫీకి గాఢమైన వాసన ఉంటుంది.అటువంటి గాఢమైనకాఫీ పరిమాళాన్ని కూడా పసిగట్ట లేకపోతున్నారంటే మీకు కరోనా వచ్చినట్లే అంటున్నారు నిపుణులు.మరి మీరు కూడా ఒకసారి కాఫీ టెస్ట్ చేసుకుని మీ అనుమానాన్ని తీర్చుకోండి.. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here