జగిత్యాల పోలీసుల నుండి మాకు రక్షణ కల్పించండంటూ..మానవ హక్కుల కమీషన్,రాష్ట్ర డిజిపి లకు బాధితుల పిర్యాదు

జగిత్యాల:జగిత్యాల పట్టణ పోలీసులు గత శనివారం రాత్రి అన్యాయంగా మమ్మల్ని నిర్బంధించి నానా భూతులతో తిట్టుతూ చిత్రహింసలు పెట్టి కొట్టారని జగిత్యాల పట్టణానికి చెందిన బూసి లచ్చన్న రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు,రాష్ట్ర డిజిపి లకు మంగళవారం పిర్యాదు చేసినట్లు తెలిపారు.బుధవారం బూసి లచ్చన్న ఆ యన కుమారుడు బూసి ఇంద్ర సేనారెడ్డి లు జగిత్యాల లో విలేఖరులతో మాట్లాడుతూ వారిని పోలీసులు చితకబాదారని ఆరోపించారు.బూసి లచ్చన్న కు చెందిన భూ తగాదా విషయంలో జగిత్యాల పట్టణ పోలీసులు పలు సార్లు వేధించగా 2020 ఆక్టోబర్ 16న జిల్లా ఎస్పీ కి పిర్యాదు చేశామన్నారు.భూతగాదా విషయాలు కో ర్టులో చూసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారని అన్నారు.అందులో జోక్యం చేసుకోకూడదని మా ముందే ఫోన్ చేసి జిల్లా ఎస్పీ పట్టణ పోలీసులను హెచ్చరించారని బా దితులు పేర్కొన్నారు.గత కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న పోలీసులు మళ్లీ స్టేషన్ కు పిలిపించుకొని అప్పటి ఎస్సై శంకర్ నాయక్ బలవంతంగా సంతకాలు తీసుకొని నీ మీద కేసు నమోదు చేశామని తెలిపినట్లు బూసి లచ్చన్న ఫిర్యాదులో పేర్కొన్నారు.గత శనివారం రాత్రి 7 గంటలకు పట్టణ పోలీసులు మళ్లీ బూసి లచ్చన్నను అతని కొడుకు ఇంద్రసేనారెడ్డి ని రాము అనే కానిస్టేబుల్ ద్వారా పిలిపించుకొని పట్టణ సిఐ జయేష్ రెడ్డి,ఎస్సై శివకృష్ణ,కానిస్టేబుల్ రాములతో పాటు మరికొందరు విచక్షణా రహితంగా చిత్ర హింసలు పెట్టి కొట్టారని,నానా బూతులు తిట్టుకుంటూ,లాఠీలతో,బెల్టు లతో కొడుతూ,పిడి గుద్దుల తో గుద్ది,బూట్ కాళ్లతో ఇష్టమొచ్చినట్లు తన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.పోలీసుల దెబ్బల వలన ఇద్దరికీ బలమైన దెబ్బలు తగిలి రక్తగాయాలు,శరీరంపై అనేక చోట్ల కండరాలు కమిలిపోయాయని,కడు పులో,ఛాతీలో,కిడ్నీల ప్రాంతంలో కూడా పోలీసులు గుద్దిన గుద్దులతో అంతర్గతంగా బలమైన దెబ్బలు తగిలి అస్వస్థతకు గురయ్యామన్నారు.మమ్మల్ని కొట్టకండి సార్,దెబ్బలతో చచ్చిపోతాం సార్ అంటూ వేడుకొని సిఐ జయేష్ రెడ్డి కాళ్లపై పడి మొక్కితే బూటు కాలుతో తనను ముఖంపై తన్నారని,తనను తన కొడుకును ఇం కా తన్నండి అని పోలీసులకు చెప్పారని బాధితుడు లచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ తలుపులు,కిటికీలు మూసేసి మమ్మల్ని నిర్బంధించి చితకబాదా రని,పోలీస్ స్టేషన్ హాల్ లో,సిఐ గదిలో,ఎస్సై ల రూమ్ లలో,రైటర్ రూమ్ లో,లాకప్ రూమ్ సందిలో తన్నుకుంటూ బోర్లించుకుంటూ కొట్టారని ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ సిసి కెమెరాలలో కూడా రికార్డ్ అయి ఉంటాయని బాధితులు ఆరోపించారు.పోలీస్ ఉన్నతాధికారులు సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు మమ్ముల ను చిత్ర హింసలు పెట్టిన తీరు పూర్తిగా ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందన్నారు.పోలీసుల దెబ్బలకు తండ్రి కొడుకులం ఇద్దరం సొమ్మసిల్లి పడిపోగా ఒక డాక్టర్ ను హు టాహుటిన పిలిపించి వైద్య పరీక్షలు జరిపించారని ఆ డాక్టర్ సూచనలతోనే మమ్మల్ని సివిల్ హాస్పిటల్ కు మా బంధువుల ద్వారా తరలించారని తెలిపారు.మరుసటి రోజున జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చేశామన్నారు.ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ని కలువండని తెలుపగా డీఎస్పీ ని కూడా కలిశామని బాధితులు అన్నా రు.పోలీస్ చిత్ర హింసలతో చచ్చి బ్రతికినట్లు చావుబ్రతుకుల నుండి బయట పడ్డామని అన్నారు.మాకు సరైన న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు (హెచ్ఆర్.సి.కి)రాష్ట్ర డీజీపీ లకు పిర్యాదు చేశామన్నారు.ఇలాంటి అన్యాయం,చిత్రహింసలు పగోనికి కూడా జరుగద్దని వారు కోరారు.ఇప్పటికీ కూడా పోలీసులతో మాకు ప్రాణ భయం ఉందని రూ.22,000 ల విలువ గల సెల్ ఫోన్ కూడా పోలీసులు గుంజుకున్నారని పిర్యాదు లో పేర్కొన్నారు.జిల్లా పోలీస్ ఉన్న తాధికారులు,డిఎస్పీ,మానవ హక్కుల కమీషన్,రాష్ట్ర డిజిపి లు స్పందించి మాకు జరిగిన అన్యాయం గూర్చి పూర్తి స్థాయిలో సరైన విచారణ జరిపించి బాద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here