న్యూ ఢీల్లి:రాజ్యసభలో సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఉదయం రవిచంద్ర తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమా ణం చేయించారు.అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మంత్రి సత్యవతి రాథోడ్,టీఆరెఎస్ పార్లమెంటరీ నాయకుడు కేకే,లోకసభ లో టీఆరెఎస్ నాయకుడు నామా నాగేశ్వర రావు,ఎంపీ లు మా లోత్ కవిత,పసునూరి దయాకర్,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,బస్వరాజు సారయ్య,బండా ప్రకాశ్,తాతా మధు,ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి,శంకర్ నాయక్,పెద్ది సుదర్శన్ రెడ్డి,నన్నపనేని నరేందర్,వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసు దేవ రెడ్డి,నాగూర్ల వెంకన్న,ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపి అభినందించా రు.అనంతరం వాళ్లంతా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,వద్ది రాజు రవి చంద్ర కు మంచి అవకాశం కల్పించారు.ఆయన ఏకగ్రీవం గా ఎన్ని కై,ఈ రోజు ప్రమాణం చేయడం,మేమంతా రావడం ఆనందంగా ఉంది.పార్లమెంటులో రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వం,ప్రజల గొంతుక అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
