బెంగళూరు:భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్ అనుచరులు వారిపై ప్రతిదాడికి దిగారు.ఈ క్రమంలో మీడియా సమావేశం రణరంగంగా మారింది.అసలేం జరిగిందంటే కర్ణాటకలో ఓ రైతు నాయకుడు డబ్బులు తీ సుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది.దీంతో టికాయత్,ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు టికాయత్ నేడు బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టికాయత్ మాట్లాడుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వద్దకు దూ సుకొచ్చారు.ముఖంపై నల్ల సిరా చల్లారు.దీంతో టికాయత్ అనుచరులు,రైతు నేతలు నిరసకారులపై ప్రతిదాడికి దిగారు.పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు.దీంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభా సగా మారింది.ఘటన అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడుతూ వేదిక వద్ద తనకు ఎలాంటి భద్రత కల్పించలేదని కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిం దని ఆరోపించారు.