ల్యాండ్ పూలింగ్ రద్దుకు కేటీఆర్ ఆదేశం..కృతజ్ఞతలు తెలిపిన అరూరి

వరంగల్:లాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని అన్నారు.కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చెందుతున్న నేపద్యంలో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెల్లారు.ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పిన విషయాన్ని సావధానంగా విన్న మంత్రి కేటీఆర్ ఆరూరి సమక్షంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ తో చర్చించి లాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించారు.తమది రైతు ప్రభుత్వమని కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందే తప్ప కళలో కూడా ఇబ్బందులు రావని ఎంఎల్ఏ ఆరూరి రమేశ్ ఈ సందర్బంగా అన్నారు.వ్యవసాయాన్ని పండగ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్,సాగునీరు,రైతుబంధు,రైతుభీమా పథకాలను అమలు చేస్తోందని,రైతాంగానికి సకాలంలో ఎరువులు,విత్తనాలు అందిస్తోందని ఆయన గుర్తు చేశారు.లాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రి కేటీఆర్,ముఖ్యమంత్రి కేసీఆర్ లకు వర్థన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ కృతజ్ఞతలు తెలిపా రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here