రెడ్డిగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

హైదరాబాద్:ఉప్పల్ ఏ రాజకీయ నాయకుడికి,ఏ మంత్రికి జరగని తీవ్ర పరాభవం తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి జరిగింది.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రెడ్డి సింహ గర్జన కార్యక్రమం జరిగింది.రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి అతిధిగా వచ్చారు.అక్కడ ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్న వాతావరణం సభా వేదికపైకి ఎక్కి ఆయన మైకు పట్టుకొని స్పీచ్‌ అందుకోవడంతో రెడ్లలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి.కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా మంత్రి తమ సామాజికవర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడతారని చాలా ఎదురుచూశారు.కాని మంత్రి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి జరిగిందని మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పార్టీ కోసమే మాట్లాడడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే ఆ ఒక్కమాటతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.కావాలని మంత్రి మల్లారెడ్డి పదే పదే కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ గొప్పల గురించే మాట్లాడుతున్నారని ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు.*భయంతో పారిపోయిన మంత్రి మల్లారెడ్డి*రెడ్డి సింహగర్జనకు వచ్చిన వాళ్లకు టిఆర్ఎస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని స్వయంగా మంత్రి మల్లారెడ్డి గమనించారు.పదే పదే మంత్రి మల్లారెడ్డి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి మళ్లీ కేసీఆర్‌ని పొగుడుతూనే మాట్లాడారు.తాను అబద్ధం చెప్పనంటూ అలాంటి అలవాటు తనకు లేదని చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లలో కొందరు కింద నుంచే రాళ్లు,చెప్పులు సభా వేదిక వైపు విసిరే ప్రయత్నం చేశారు.జరగబోయే చేదుఅనుభవాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా మంత్రి వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వేది క దిగి వెళ్లిపోయారు.*కాన్వాయ్‌పై చెప్పులు,రాళ్లు,కుర్చీలతో దాడి*పదే పదే కాంగ్రెస్,బీజేపీలను దుమ్మెత్తిపోస్తూనే ఆ పార్టీ నేతలను ఏకిపారేస్తారు మంత్రి మల్లారెడ్డి.అంతే స్థాయిలో అధికార పార్టీ పై ప్రశంసలు గుప్పిస్తారు.ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని పొగడుతారు ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అభివృద్ధి చేయడంలో కేసీఆర్‌కి సాటి ఎవరూ రానిపై తెగ పొగుడుతూ ఉంటారు.అలాం టి ప్రసంగమే రెడ్డి సింహ గర్జన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చేయడంతో జనం మండిపడ్డారు.మంత్రి ప్రసంగం మధ్యలో ఆపేసి వెళ్లిపోతుండగా కుర్చీల్లోంచి లేచి కుర్చీలను వేదికపైకి విసిరారు. కాన్వాయ్‌ని ఫాలో అయ్యారు.మంత్రి కారుపై కుర్చీలు,రాళ్లు,చెప్పులు విసిరారు.కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించారు.ఈసందర్భంలో మంత్రి సెక్యురిటీ కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొనడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి తన నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని రెడ్డి నాయకులు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here