ఇది నిజం నమ్మండి..16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ..వివాహం

భోపాల్:16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసింది.అయితే,గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు,బాలుడికి పెళ్లి చేశా రు.దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు.సంబంధిత అధికారులు రంగంలోకి దిగడంతో బాలుడిని తీసుకుని ఆ మహిళ,ఆమె కుటుంబ సభ్యులతో పరారయ్యింది.ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనం ప్రకారం మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి,ఆ గ్రామ సర్పంచ్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో అతడిపై గ్రామ సర్పంచ్ పగ పెంచుకు న్నాడు.ఇందుకోసం భర్తకు విడాకులిచ్చిన ఓ మహిళను రంగంలోకి దించాడు.తనవైపు ఆ బాలుడు కామంతో చూస్తున్నాడంటూ గ్రామపెద్దలకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది.ఈ విషయమై గ్రామ పె ద్దలు పంచాయతీ పెట్టారు.అనంతరం ఆ బాలుడికి,ఆ మహిళకు పెళ్లి చేశారు.దీంతో ఆ బాలుడి తండ్రి సంబంధిత అధికారులను ఆశ్రయించాడు.అధికారులు రంగంలోకి దిగడంతో ఆ మహిళ బాలు డు,ఆమె కుటుంబ సభ్యులతో పరారయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here