హుజురాబాద్ లో నిరుద్యోగులు పోటీ చేయాలి:షర్మిల

హుజురాబాద్:హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌టిపి అధినాయకురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లాలో మంగళవారం నాడు షర్మిల నిరుద్యోగులకు అండగా 5వ దఫా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట మండలం,సిరిసేడు గ్రామంలో షర్మిల దీక్ష చేశారు.ఈ సం దర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేసే హక్కు అందరికీ ఉందని,నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.నియోజకవర్గాల్లో సమ స్యలుంటే ఆయా ఎంఎల్‌ఎలతో రాజీనామాలు చేయిస్తేనే పథకాలు వస్తాయని ఆమె అన్నారు.దళిత బంధు పథకం కింద దళితులకు రూ.10 లక్షలు కాదు రూ.51 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గ్రామానికి చెందిన షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల ఈ సందర్బంగా పరామర్శించారు.షబ్బీర్ మనస్సు ఎంత క్షోభిస్తే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడని ఆవేదని వ్యక్తం చేసింది.తెలంగాణకు విద్య,వైద్యం అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని చెప్పు కొచ్చారు.హుజురాబాద్ ఉప ఎన్నిక పగలు,ప్రతీకారాలు చూపించుకునేందుకు తీసుకువచ్చారని,ఈ ఉప ఎన్నికలతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని తేల్చి చెప్పా రు.ఏడేళ్లలో ఏడు వేల మంది నిరుద్యోగులు చనిపోయారని,ఓటు కోసం ఏ పార్టీ వాళ్లు వచ్చినా నిలదీయండని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.లావణ్య అనే నిరు ద్యోగి సెల్ఫీ వీడియో తీసుకోని ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని షర్మిల విమర్శించారు.

కేసీఆర్ ఇచ్చింది అవమానాలు,ఆత్మహత్యలు.అన్యాయంగా రాష్ట్రంలోని 7,561 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారు.వారిలో వెయ్యి మంది హుజూరాబాద్‌లో పోటీ చేస్తామని చెబుతున్నారు.వారికి మా మద్దతు ఉంటుంది.ఆత్మహత్యలు చేసుకున్న నేతన్న భార్యలు కూడా హుజూరాబాద్‌లో పోటీ చేస్తామం టున్నారు.వారికి కూడా మా మద్దతు ఉంటుంది.నిరుద్యోగులు కూడా హుజూరాబాద్‌లో పోటీ చేయాలి.కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేం పోరాటం చేస్తాం.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలను భర్తీ చేసి,54లక్షల నిరుద్యోగులకు స్కిల్‌ డెవ లప్ మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.అంతేకాక నిరుద్యోగులకు ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి.అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here