అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు..అండగా నిలిచిన గల్ఫ్ సేవాసమితి

జగిత్యాల:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ-చుక్క రమేష్ లిద్దరూ నెల గడువులోనే గత జూన్-జులై మాసా లలో చనిపోయారు.వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య (13) చుక్క నాగలక్ష్మి (10) లు తల్లిదండ్రులు లేని,ఉండడానికి”‘గూడు”‘కూడా సరిగా లేని అనాధలయ్యారు.వీరి పరిస్థితి గురించి మీడియా సోషల్ మీడియా ల ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు కులమతాల కతీతంగా రాజకీయాల కతీతంగా సహృద యంతో స్పందించి విరాళాలు అందజేశారు.గల్ఫ్ సేవా సమితి బుగ్గారం పక్షాన రూ.55,000,సోషల్ మీడియా లో యువత ద్వారా రూ.54,000 ఇతర ప్రముఖులు రాజకీయ నేతల ద్వారా రూ.53,000 మొత్తం రూ.1,62,000 విరాళాలు అందజేశారు.ఇందులో నుండి పిల్లల భవిష్యత్ కొరకు తలా రూ.54,000 చొప్పున రూ. 1,08,000 బ్యాంక్ లో పిక్షుడ్ డిపాజిట్ చేసి మిగతా సొమ్ము వారి అవసరాల కొరకై వేర్వేరుగా పిల్లల సేవింగ్ ఖాతాలలో రూ.27వేల చొప్పున జమచేశారు.ఈ అనా ధ పిల్లల కోసం బుగ్గారం గ్రామస్తులైన సాన తిరుపతి,మహమ్మద్ అజ్మీర్ షరీఫ్,సాన మల్లేశం,బొడ్డు అనిల్,కొడిమ్యాల రాజేష్,భారతపు గంగాధర్,సుంకం ప్రశాంత్ త దితరులు లు విశేష కృషి సల్పారు.ఇటీవల జరిగిన బుగ్గారం పర్యటన సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా ఈ అనాధ పిల్లలతో మాట్లా డి వారి విద్యాభివృద్ధికి,ఇతర అవసరాలకు తనవంతు సహాయము చేస్తామని హామీ ఇస్తూ తక్షణ సహాయంగా రూ.10వేలు నగదుగా అందజేశారు.దాతలకు,పిల్లల భవిష్యత్ కై విరాళాల సేకరణకు కృషి చేసిన వారికి పలువురు ప్రముఖులు,బుగ్గారం గ్రామస్తులు,గ్రామ అభివృద్ధి కమిటీ,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,మృతి చెందిన జంట బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here