నేడు..హుజూరాబాద్ నియోజకవర్గంలో”నిరుద్యోగ నిరాహార దీక్ష”చేయ నున్న షర్మిల

జమ్మికుంట:ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేపడుతున్న వైఎస్ఆర్ టిఎస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ నియోజ కవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు.ఈ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు “నిరుద్యోగ నిరాహార దీక్ష” చేపట్టనున్నారు.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల.గతవారం తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రాక షబ్బీర్ అనే యువకుడు ట్రైన్ కింద పడి హాత్మహత్య చేసుకున్నాడు.ముందుగా షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ షర్మిల అనంతరం దీక్షకు దిగనున్నారు.అయితే ప్రతి మంగళవారం షర్మిల దీక్ష చేయడం సాధారణమే అయినా ఆమె ఈసారి చేయబోయే దీక్ష హుజూరాబాద్ నియోజకవర్గంలో కావడంతో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే అటు ఈటల రాజేందర్‌ తో పాటు అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో గెలుపుపై ఫోకస్ పెట్టింది.కాంగ్రెస్ కూడా ఇదే త్వరలోనే హుజూరాబాద్‌ కేంద్రంగా వివిధ రకాల కార్యక్రమాలను ప్లాన్ చేస్తోం ది.ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్న వైఎస్ షర్మిల ఏం చేయనున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here