కారు కింద పడతారో..ఏనుగు ఎక్కుతారో తేల్చుకోండి:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ:రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోంది రిజర్వేషన్లు మా హక్కు భిక్ష కాదు మేం చదువుకుంటే వాళ్ల కళ్లకు మంట రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెయ్యి గురుకులాలు పెట్టి విద్యావ్యవస్థ మారిపోయిందన్నారు.ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.రాష్ట్రంలోని విద్యార్థుల్లో 4 లక్షల మందే గురుకులాల్లో చదువుతున్నారు.ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే మి గతా 30 లక్షల మంది పేద బిడ్డలకు విద్య బంద్‌ చేస్తే బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త,విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.బహుజనులంతా పాలకులవుతారని,ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వెళ్లాలని,ఎర్రకోటపైనా నీలి జెండా ఎగ రాలని పిలుపునిచ్చారు.ప్రజలు కారు కింద పడతారా ఏనుగు ఎక్కి వెళ్తారా తేల్చుకోవాలన్నారు.ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు.నల్గొండ ఎన్జీ కాలేజీలో రాజ్యాధికార సంకల్ప సభ జరిగింది.ఈ సభకు బీఎస్పీ జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్ విచ్చేశారు.ఆయన సమ క్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ,నిరుపేద ప్రజల కోసమే ఉద్యోగం వదులుకున్నట్టు వెల్ల డించారు.బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.ఇప్పుడు సీఎం కేసీఆర్ దళితులకు ఇస్తామంటున్న రూ.1000 కోట్లు ఎవరి డబ్బు అని నిలదీశారు.ఒకవేళ ఆయనకు దళితులపై అంత ప్రేమే ఉంటే సొంత ఆస్తులు అమ్మి ఇవ్వాలని స్పష్టం చేశారు.బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మా రాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here