హుజురాబాద్:త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని కేసీఆర్,హరీశ్ రావుకు సవాల్ విసిరారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఆయన ఆదివారం పర్యటించారు.కేసీఆర్,హరీశ్ రావులకు ఈటల రాజేందర్ సవాల్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నన్ను ఓడించేందుకు 5 వేల కోట్లయినా ఖర్చు చేస్తారట.బక్క పల్చటి పిలగాడు దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్ ? నేను దిక్కులేని వాన్ని కాదు.హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను.వస్తవా రా! హరీశ్.ఇక్కడ పోటీ చేద్దాం.నా మీద పోటీ చేయ్.అంటూ ఇవాళ సంచలన ఛాలెంజ్ లకు దిగారు బీజేపీ హుజురాబాద్ నేత ఈటల రాజేం దర్.బక్క పల్చటి పిలగాడు,దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించు కున్న బిడ్డను నేను.పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా గొర్రెలిచ్చినా కులాలవారిగా తాయిలాలిచ్చినా నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నారేపు ఎన్నికల్లో చూసుకుందాం అంటే ఈటల ఛాలెంజ్ విసిరారు.ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు.ఈటల రాజేందర్‌ను ఓడించేం దుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట.గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లువాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే.న న్ను కాపాడుకుంటరా చంపుకుంటరా మీ ఇష్టం.అంటూ ఈటల హుజురాబాద్ ప్రజల్ని కోరారు.ఎక్కడ దు:ఖం ఉన్నా ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను.దళితుల ఓట్ల మీద తప్ప హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదు.హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్ ఓట్లయ్యాక ఆ హామీ నెరవేర్చలేదు. అంటూ ఈటల చెప్పుకొచ్చారు.దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలి.తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు.అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి.ఏమిచ్చినా తీసుకోండి.ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి.అంటూ ఇవాళ నిర్వ హించిన హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఈటల ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...