పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘనపై..సీజెఐ ఎన్వీ రమణ ఆందోళన

న్యూఢిల్లీ:జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.పోలీసులు సున్నితంగా వ్యవహ రించాల్సిన అవసరం ఉందని తెలిపారు.జాతీయ న్యాయ సేవ కేంద్రం(నల్సా) మొబైల్ యాప్ ప్రారంభించిన కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.పోలీసు కస్టడీ లోని నిందితులు ఇప్పటికీ శారీరక హింసకు గురికావడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయస్థానాల దృష్టికి వచ్చిందన్నారు.పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అవగాహన క ల్పించాల్సి ఉందన్నారు.దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ న్యాయసేవా కేంద్రం-నల్సా యాప్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here