హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

కరీంనగర్:హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యాడు.ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ నుంచి హుజూరా బాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటన చేశారు.ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే దళిత బంధు ప్రారంభ సమావే శం సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రా మానికి చెందిన గెల్లు మల్లయ్య,లక్ష్మీ దంపతులకు శ్రీనివాస్ యాదవ్ 1983,ఆగస్టు 21న జన్మించాడు.ఇంటర్ వరకు కరీంనగర్ జిల్లాలోనే చదివిన శ్రీనివాస్ ఉస్మా నియా యూనివర్సిటీ నుంచి ఎంఏ,ఎల్ఎల్‌బీ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.గగన్ మహల్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చదు వుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.అంబర్‌పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2003 నుంచి 2006 వరకు టీఆర్ఎస్వీ అధ్యక్షులుగా (2003-06) గెల్లు కొనసాగారు.అనంతరం 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ నియమి తులయ్యారు.అనంతరం 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here