ఇవే’దళితబంధు’పథకాలు..

హైదరాబాద్:తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంపై జోరుగా చర్చ సాగుతోంది.నిరుపేదలైన దళితులు ఆర్థికంగా పురోగతి సా ధించాలని ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.అయితే హుజూరాబాద్ నియోజకవర్గలో ఉప ఎన్నిక జరగున్న నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకొచ్చా రని కొందరు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా దీని గురించి ఇదివరకే చర్చించామని అయితే వేదిక కోసం వేచి చూశామన్నారు.ఏదీ ఏమైనా ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హలైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి యూనిట్ ఏర్పాటు కోసం ప్రోత్సహించనున్నారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్ప టికే దళిత బంధును వాసాల మర్రి అనే గ్రామంలో ప్రారంభించారు.అక్కడి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు.ఈనెల 16న హుజూరాబాద్ ని యోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఇప్పటికే దళిత బంధు అమలు కోసం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసిన ఆయన 16న అధికారికంగా లబ్ధి దారులకు అందించనున్నారు.ఈ నేపథ్యంలో దళిత బంధుకు ఇచ్చే ఆర్థిక సాయంతో ఏమి చేయాలో తెలుపుతూ ఓ జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.1.మినీ డెయిర యూనిట్ (10 నుంచి 12 పాడి గేదెలు)2.పందిరి కూరగాయల సాగు3.వరినాటు యంత్రాలు (2 యూని ట్లు)4.వేపనూనె-పిండి తయారీ 5.వ్యవసాయ సాగు కోసం యంత్ర పరికరాల సేల్స్6.మట్టి ఇటుకల తయారీ ఆటో ట్రాలీ 7.ట్రాక్టర్+ ట్రాలీ 8.కోడిపిల్లల పెంపకం 9. సెవెన్ సీటర్ ఆటో10.ఆటోరిక్షాలు (మూడు యూనిట్లు)11.మూడు చక్రాల ఆటో ట్రాలీలు( సరుకుల రవాణా కోసం)12.విత్తనాలు-ఎరువుల దుకాణం13.టెంట్ హౌ స్ డెకరేషన్ లైటింగ్ సౌండ్ సిస్టం14.మడిగల నిర్మాణం-వ్యాపారం15.ఆయిల్ మిల్లులు-పిండిగిర్నీలు16.4 చక్రాల వాహనం17.ఎలక్ట్రానిక్ పరికరాలు అమ్మకం సేవ లు18.డయోగ్నొస్టిక్ ల్యాబ్ మెడికల్ షాప్19.ఎలక్ట్రికల్ షాప్ మరియు బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్20.హార్డ్ వేర్-శానిటరీ దుకాణం+ట్రాలీ21.సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ22.సెంట్రింగ్-ఆర్సీసీ రూప్ తయారీ23.ఆక్రిలిక్ షీట్స్ టైల్స్ తయారీ24.కాంక్రీటు మిశ్రమం తయారీ యంత్రాలు25.హోటల్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ +ఆటో ట్రాలీ26.ఐరన్ గేట్లు గ్రిల్స్ తయారీ యూనిట్27.ప్రభుత్వ అనుమతితో మెడికల్ జనరల్ స్టోర్స్28.మినీ సూపర్ బజార్29.డీటీసీ మీసేవ ఆన్ లైన్ సేవలు +ఫొటో స్టూడియో30.బిల్డింగ్ సామగ్రి హార్డ్ వేర్ దుకాణం దళిత బంధు ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు పడగానే వారు ఎంచుకున్న యూనిట్లను సంబం ధిత అధికారులు కొనిస్తారు.అయితే ఈ నిధులు పక్కదారి పడకుండా లబ్ధిదారుల అవసరాలకు ఉపయోగపడేలా అధికారులు పర్యవేక్షిస్తారు.హుజూరాబాద్ నియోజక వర్గంలో 20.929 దళిత కుటుంబాలను ఎంపిక చేస్తారు.నిబంధనల ప్రకారు అర్హులైన వారికి మాత్రమే ఆ మొత్తాన్ని అందజేస్తారు.ఇక ఈనెల 16న సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు సభా ఏర్పాట్లు చేరస్తున్నారు.శాలపల్లి-ఇందిరానగర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగా అర్హులకు దళిత బంధు పత్రాలను అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here