కరీంనగర్:తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల,తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం,బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.హుజురాబాద్ నియోజక వర్గంతో ఈటలకు మంచి అనుబంధం ఉన్న ది.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల సడెన్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడం,ఆయన ఆస్తులపై అభియోగాలు రావడంతో రాజ కీయాల్లో వేడి రగులుకున్నది.ఈటల బీజేపీలో చేరిన తరువాత హుజురాబాద్ నియోజక వర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది.త్వరలోనే ఈ నియోజక వర్గానికి సంబందించిన ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నది.దీంతో ఎలాగైనా గెలిచి పట్టునిలుపుకోవాలని ఈటల చూస్తుంటే,ఈటలకు సముచిత స్థానం ఇచ్చామని,కాని చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి పార్టీ మారాడని అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నది.ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరవే యాలని ఆ పార్టీ చూస్తున్నది.కాంగ్రెస్ కూడా పార్టీ అభ్యర్ధిని రంగంలోకి దించేందుకు కసరత్తు ప్రారంభించింది.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరు వాత జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో హుజురాబాద్‌పై దృష్టి సారించారు.పార్టీ విజయం సాధించకున్నా గతంలో కంటే మెరుగైన ఓటింగ్‌ను పెంచుకోవాలని కాం గ్రెస్ పార్టీ చూస్తున్నది.వ్యక్తిగతంగా ఈటలకు హుజురాబాద్‌లో మంచి పట్టు ఉండటంతో టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదన్నది నిపుణుల అభిప్రాయం.అయితే దేశవ్యాప్తంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం హుజురాబాద్ ఎన్నికలపై పడే అవకాశం ఉండోచ్చు.