కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల సహాయం:అల్లం నారాయణ

హైదరాబాద్:జర్నలిస్టులసంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్న లిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయ ణ తెలిపారు.కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడ బ్ల్యూజె(H143))ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది.రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రో జుల సమయంలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మీడియా అకా డమి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నది.ఇటీవల కరోనాతో మరణించిన జర్నలి స్టుల కుటుంబాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాల యానికి మే,10వ తేదీలోగా దర ఖాస్తులు సమర్పించాలి.మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము,అక్రిడి టేషన్ కార్డు,కరోనా పాజిటివ్ రిపో ర్టులతోపాటు ఆయా జిల్లాల డి.పి. ఆర్.ఓ.లు ధృవీకరించవలసి ఉం టుంది.ఆయా జర్నలిస్టు సంఘాలు మరణించిన కుటుంబాల తరుఫున ధృవీకరణ పత్రాలు సమర్పించడా నికి కృషి చేయవలసిందిగా కోరుతు న్నామని అల్లం నారాయణ కోరారు.దరఖాస్తులు పంపవలసిన చిరునామా:కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,హైదరా బాద్ చిరునామా:ఇంటి నెం.10-2-1,సమాచార భవన్,2వ అంతస్తు,ఎ.సి.గార్డ్స్,మాసాబ్ ట్యాంక్,తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్,హైదరాబాద్.ఇతర వివరాలకు టెలిఫోన్ నెం 040- 23298672/ 74 నెంబర్లను సంప్రదించగలరు.జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఫ్రంట్ లైన్ వారి యర్లుగా జర్నలిస్టులను గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు,జర్నలిస్టులందరికీ టీకా కార్యక్రమం,కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు ఆసుపత్రులలో ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని,అట్లాగే కొత్తగా 200 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడిన వారికి కూడా నేటి నుం చి తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నామని అల్లం నారాయణ తె లియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here