కేసీఆర్,కేంద్రానికి డాక్లర్లు,లాయర్ల బృందం లేఖ

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా విజృంభిస్తుండటం కలకలం రేపుతోంది.ఈక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రానికి 50 మంది డాక్టర్లు,లాయర్లతో కూడిన బృందం లేఖ రాసింది.డాక్టర్ లక్ష్మీ లావణ్య అల్లపాటి నేతృత్వంలో రాసిన లేఖలో 20 కీలక అంశాలను ప్రస్తావించా రు.ప్రధానంగా కరోనా కేసుల పాజిటివిటి,మరణాల రేటు లెక్కలపై పారదర్శకంగా వెల్లడించాలని వారు లేఖలో కోరారు.బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని విజ్ఞప్తి చే శారు.ముఖ్యంగా రెమిడెసివర్,ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని లేకుంటే తీవ్ర ప్రమాదం తప్పదని అభిప్రాయపడ్డారు.కరోనా బాధితులను మెడిసిన్ బయట నుం చి తెప్పించుకోవాలని చెప్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కువగా రాపిడ్ టెస్టులపైనే ఆధా రపడుతున్నారని ఆర్టీపీసీఆర్ సంఖ్య పెంచాలని అన్నారు.హెల్త్ బులిటెన్లో తప్పిదాలు ఉన్నాయని.ప్రజలకు నమ్మకం కలగాలి అంటే ఇప్పటికైనా సరైన లెక్కలు చెప్పా లని అన్నారు.కరోనా నియంత్రణలో డీఆర్‌డీవో సహాయం తీసుకోవాలని ఇప్పుడు చాలా అవసరమని డాక్టర్లు,లాయర్ల బృందం అభిప్రాయపడింది.లక్షలాది మంది చ నిపోతున్నారని ఆ విషయాన్ని బయటికి చెప్పాలని కోరారు.డాక్టర్లకు పీపీఈ కిట్,మాస్క్‌లు అందుబాటులో లేవని వైద్యులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు.వెంటిలేటర్స్,ఐసీయూ బెడ్ల గురించి ఎప్పటికప్పడు సరైన సమాచారం అందించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here